Share News

తిరుమల లడ్డూ కల్తీపై వైసీపీ నేతలు చెప్పింది అబద్ధం: మంత్రి అచ్చెన్నాయుడు

ABN , Publish Date - Feb 19 , 2026 | 01:55 PM

ఏపీ శాసనమండలిలో తిరుపతి లడ్డూలో కల్తీ జరుగలేదని వైసీపీ నాయకులు చెప్పింది అబద్ధమని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. కల్తీ నెయ్యి అంశంపై చర్చ జరపాలంటే ముందు వారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

తిరుమల లడ్డూ కల్తీపై వైసీపీ నేతలు చెప్పింది అబద్ధం: మంత్రి అచ్చెన్నాయుడు
Minister Atchannaidu

అమరావతి, ఫిబ్రవరి 19: వైసీపీపై మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మంత్రి మాట్లాడుతూ.. మూడు రోజుల నుంచి సంబంధం లేని విషయాలు తీసుకువచ్చి సభా సమయాన్ని వైసీపీ సభ్యులు వృధా చేస్తున్నారని మండిపడ్డారు. శాసనమండలిలో తిరుపతి లడ్డూలో కల్తీ జరుగలేదని వైసీపీ నాయకులు చెప్పింది అబద్ధమని మంత్రి ఆరోపించారు. కల్తీ నెయ్యి అంశంపై చర్చ జరపాలంటే ముందు వారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.


తిరుమల లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందని మాజీ టీటీడీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి స్పష్టంగా చెప్పారని మంత్రి గుర్తు చేశారు. తిరుమల లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందని అన్ని నివేదికలు నిర్ధారించాయని, అందుకే కూటమి ప్రభుత్వం పాత టెండర్లను రద్దు చేసి కొత్త టెండర్లను పిలిచిందని మంత్రి వివరించారు. కొత్త టెండర్లలో కిలో నెయ్యి 650 రూపాయలకు ఇచ్చారని చెప్పారు. కిలో నెయ్యి 350 రూపాయలకు ఎక్కడ ఇచ్చారో వైసీపీ సభ్యులు చూపించాలని అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు.


హెరిటేజ్ డైరీ.. ఉన్నత ప్రమాణాలకు పెట్టింది పేరన్నారు మంత్రి. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కుటుంబం సభ్యులకు అప్పగించారని తెలిపారు. ప్రభుత్వం నుంచి హెరిటేజ్‌తో ఎటువంటి లావాదేవీలు జరుపకూడదని పాలసీ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. కల్తీ నెయ్యి మీద చర్చకు అనుమతి ఇవ్వాలంటే, కల్తీ జరుగలేదని చెప్పిన వైసీపీ నాయకులు ముందు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చీజ్ ప్యాకెట్ చూపించి నెయ్యి ప్యాకెట్ అని చెప్పడం దుర్మార్గమని మండిపడ్డారు. నెయ్యి కల్తీ కాలేదని చెబుతున్న వైసీపీ మాటలన్నీ కల్తీ మాటలే అని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి...

సాక్షి మీడియాకు డిప్యూటీ స్పీకర్ రఘురామ లీగల్ నోటీసులు

మండలిలో విజిల్స్ వేస్తూ వైసీపీ హంగామా.. అచ్చెన్నాయుడు ఫైర్

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 19 , 2026 | 02:07 PM