ఇబ్రహీంపట్నం కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌కు ఉచ్చు బిగుస్తోంది. జోగి రమేష్ చెప్తేనే నకిలీ మద్యం తయారు చేశానంటూ సిట్ అధికారుల విచారణలో జనార్ధన్ రావు సంచలన విషయాలు వెల్లడించారు.
మొంథా తుఫాన్‌పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి స్పందించారు. మొంథా తుఫాన్ ధాటికి జనజీవనం అల్లకల్లోలం అయితే తమకేం పట్టనట్లు..
ప్రజలకు ఎలర్ట్ మెసేజ్‌లు కూడా పంపామని.. పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో బాగా నష్టం జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ వెల్లడించారు. ప్రతి జిల్లా కలెక్టర్‌లు, ప్రభుత్వ యంత్రాంగం బాగా పని చేశారని కొనియాడారు.
మొంథా తుపాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలు, ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరద నీటితో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకు వరద పోటెత్తింది. ఈ వరద ప్రవాహం గురువారం సాయంత్రానికి మరింత వచ్చి చేరుతుందని అధికారులు అంటున్నారు.
తుపాను కారణంగా బాగా నష్టపోయామని.. ఎకరానికి రూ. 30 వేలు ఖర్చు అయ్యిందని రైతులు తెలిపారు. తడిసిన ధాన్యం, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు.
పులిచింతల నుంచి సుమారు 4 లక్షల 80 వేల క్యూసెక్కుల వరద నీరు చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రకాశం బ్యారేజ్‌కు సాయంత్రానికి సుమారు 5 నుంచి 6 లక్షల క్యూసెక్కుల వరద చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
డ్వాక్రాలోని మహిళా చిరు వ్యాపారులకు దుకాణాలు ఏర్పాటు చేయాలన్న ఆదేశాలు పాలకవర్గం పాటించలేదు. స్కీమ్ అమలు చేయలేమని, రూ.1.16 కోట్లు కేటాయించలేమని అక్టోబర్ 8న తీర్మానం చేసింది.
కృష్ణా నదికి భారీగా వరద నీరు వచ్చి చేరనుందని.. అలాగే ప్రకాశం బ్యారేజీ వద్ద నేటి ఇన్ఫ్లో ఆరు లక్షలకు చేరుతుందని ఏపీ జలవనరుల అభివృద్ధి శాఖ వెల్లడించింది.
మంత్రి లోకేశ్ ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టుకుని.. మోసాలకు పాల్పడుతున్న ముఠాను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు నిందితులకు కోర్టు 14 రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణా నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మునేరు మహోధృతం కాగా, వైరాయేరు, కట్టలేరు ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. రోడ్లపైకి వరద చేరుతుండటంతో తెలంగాణా నుంచి రాకపోకలు దాదాపు బంద్ అయ్యాయి.