చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఆర్టీసీ బస్సును కంకర లారీ ఢీకొనడంతో 17 మంది మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనైట్లు ఏపీ డిప్యూటీ సీఎం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడుపై కేసు నమోదు చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత జోగి రమేశ్‌ని ఆదివారం ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్ విచారణ పూర్తి అయింది. సుమారు 7 గంటల పాటు జోగి రమేశ్‌ని సిట్, ఎక్సైజ్ పోలీసులు విచారించారు.
చంద్రబాబు, లోకేష్ లకు అరెస్టుతో సంబంధం లేదని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. జోగి రమేష్‌కు బీసీ కార్డు వేసుకోవడానికి సిగ్గుండాలని విమర్శించారు.
ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిని పోలీసులు మోహరించారు.
సీఎం చంద్రబాబుగా ఉండగా మూడుసార్లు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అందజేసినట్లు తెలిపారు. వైసీపీ హయాంలో ఒక్క రూపాయి కూడా ప్యాకేజ్ ఇవ్వలేదని మంత్రి రామానాయుడు మండిపడ్డారు.
నాటి నిర్ణయాల వల్ల అమరావతి అనేక కష్టాలకు గురైందని ఎన్వీ రమణ తెలిపారు. కష్టకాలంలో విట్ లాంటి యూనివర్సిటీ నిలబడిందన్నారు.
ఆపద సమయంలో ప్రభుత్వానికి- ప్రజలకు మధ్య వారధిగా ఉండాల్సిన జగన్ చేసే వ్యాఖ్యలు అర్థరహితమని ధూళిపాళ్ల అన్నారు. జగన్ చేసే వ్యాఖ్యలు రాజకీయ లబ్ధి కోసమే అని ఆరోపించారు. బెంగుళూరు ప్యాలెస్‌లో కూర్చుని జగన్ చేసే వ్యాఖ్యలు ఎవరూ నమ్మరని తెలిపారు.
నవంబర్ 15లోపు 250 కోట్ల రూపాయలు విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందని అసోషియేషన్ వెల్లడించింది. అన్ని బకాయిల పరిష్కారానికి ఒకేసారి సెటిల్‌మెంట్ విధానానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.