2024లో ఎవరూ ఊహించని విజయం సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై సీఎం శ్వేతపత్రం విడుదల చేశారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ముస్తఫా ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. గుజరాత్‌లో ముస్తఫాను నూజివీడు పోలీసులు అరెస్ట్ చేశారు.
గోదావరి, కృష్ణా జలాల వివాదాల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేసిన యువతిపై ఆలయ అధికారులు సీరియస్ అయ్యారు. దేవస్థానం ఆచారాలు, సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ యువతిపై విజయవాడ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గాదె సాయికృష్ణ కేసులో సిట్ అధికారులు వేగం పెంచారు. ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుడు సురేశ్ ఆచూకీ తెలపాలంటూ గుర్తులతో ప్రకటన విడుదల చేశారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. విమానాశ్రయం టెర్మినల్ వద్ద నిలబడి భోగాపురం ఎయిర్‌పోర్ట్ వైపు చూపిస్తున్న స్టిల్ ఫొటోను షేర్ చేస్తూ ‘The future? Yeah... it's that way!’ అని క్యాప్షన్ ఇచ్చారు.
భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవంలో ఆదివాసీ బాలికల థింసా నృత్యం అద్భుతమని సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు. 13 వేల మందికిపైగా ఆదివాసీ బాలికలతో ప్రపంచ రికార్డు స్థాయిలో ప్రదర్శన ఇచ్చారన్నారు.
సౌత్ కోస్టల్ రైల్వే జీఎం మాథుర్‌ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ శనివారం కలిశారు. జీఎం మాథుర్‌ను కలిసి పలు కీలక అంశాలపై చర్చించామని తెలిపారు.
నాగార్జునసాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలోని గిద్దలూరు డివిజన్, రాచర్ల బీట్‌లో పులి మరణించిన ఉదంతంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. పులిది సహజ మరణమా.. లేక వేటగాళ్ల దుశ్చర్య అనే కోణాల్లో క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న అప్పటి సీఐ ఎస్‌ఎస్ వీవీ నాగరాజు రెండో రోజు విచారణలోనూ మౌనం పాటించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు అడిగిన ఏ ప్రశ్నకూ ఆయన సమాధానమివ్వలేదు.