Home » Andhra Pradesh » Kadapa
కడప ఎంపీ అవినాశ్‌రెడ్డిపై పులివెందుల తెలుగుదేశం ఇన్‌చార్జ్ బీటెక్ రవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినాశ్‌రెడ్డి ప్రెస్‌మీట్ చూస్తే ఆస్కార్ అవార్డు ఇచ్చే రేంజ్‌లో ఉందని ఎద్దేవా చేశారు.
అతి వేగం, నిర్లక్ష్యం వెరసి మూడు నిండు ప్రాణాలను చిదిమేశాయి. కళ్లముందే ఎంతో భవిష్యత్తు ఉన్న ముగ్గురు యువకులు మృత్యుఒడికి చేరుకోవడంతో అన్నమయ్య జిల్లా కురుబల కోట మండలం సర్కారుతోపు వద్ద విషాద ఛాయలు అలముకున్నాయి. వివరాల్లోకి వెళితే..
తన తండ్రి హత్య కేసులో దర్యాప్తు సంస్థ సీబీఐ బాధ్యతగా విచారణ జరపడం లేదని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం కడపలో వైఎస్ సునీత విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ హత్య కేసులో కీలక నిందితులు చెప్పిందే వినడం తప్ప.. వారిని లోతుగా సీబీఐ విచారించ లేదన్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టులో ఈరోజు(బుధవారం) విచారణ జరిగింది. కడప వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డితో పాటు మిగతా వారి బెయిల్ రద్దు చేయాలంటూ వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన పిటీషన్లను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది.
టమోటా రైతుల కష్టం పశువులు, గొర్రెలకు మేతగా మారింది. కోటి ఆశలతో సాగు చేసిన టమోటా పంట అన్నదాతకు అప్పులే మిగిల్చింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ కోర్టులో సోమవారం విచారణ జరిగింది. నిందితులు సీబీఐ కోసం కాకుండా, ముందుగా సిట్ దర్యాప్తు చేసిన వివరాలను అందజేయాలని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
కడప జిల్లా రాజంపేటలో గంజాయి ముఠా తీవ్ర కలకలం సృషించింది. స్థానిక అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో గంజాయి మత్తులో ఉన్న కొందరు యువకులు వీరంగం సృష్టించారు. వివరాల్లోకి వెళితే..
కడప జిల్లా రాజంపేటలో అర్ధరాత్రి వేళ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక రైల్వేస్టేషన్ రోడ్డులో ఉన్న 'దీప్ లాడ్జి'లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. 32మంది అస్వస్థతకు గురయ్యారు.
కడప జిల్లా పులివెందులలో భారీ అవినీతి తిమింగలాలపై ఏసీబీ అధికారులు జరిపిన మెరుపు దాడులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఏసీబీ అధికారులు సీఐ ఇంటికి చేరుకుని సోదాలు నిర్వహించారు.
మదనపల్లిలో దారుణ హత్యకు గురైన ఏడేళ్ల బాలిక అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. చిన్నారికి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటి వీడ్కోలు పలికారు.