Share News

Illegal Sand Mining: బయటపడ్డ వైసీపీ మరో స్కాం.. వెలుగులోకి సంచలన విషయాలు..!

ABN , Publish Date - Dec 19 , 2025 | 07:14 AM

ప్రభుత్వం ఏదైనా వైసీపీ నేతల మట్టిదందా మాత్రం ఆగడం లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో అందుబాటులో ఉన్న ఖనిజ సంపదను, ప్రభుత్వ భూములను విచ్చలవిడిగా దోచేశారు. కడప నగరానికి కూతవేటు దూరంలోని చింతకొమ్మదిన్నె మండలంలో దందా మరింతగా సాగింది.

Illegal Sand Mining: బయటపడ్డ వైసీపీ మరో స్కాం.. వెలుగులోకి సంచలన విషయాలు..!
Illegal Sand Mining

  • వైసీపీ నేత మట్టి దందా

  • ఏపీఐఐసీ భూముల్లో నుంచి తరలింపు

  • రెండు వాహనాలు సీజ్‌

కడప రూరల్‌, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఏదైనా వైసీపీ నేతల మట్టిదందా (YSRCP Leader Illegal Sand Mining) మాత్రం ఆగడం లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో అందుబాటులో ఉన్న ఖనిజ సంపదను, ప్రభుత్వ భూములను విచ్చలవిడిగా దోచేశారు. కడప నగరానికి కూతవేటు దూరంలోని చింతకొమ్మదిన్నె మండలంలో దందా మరింతగా సాగింది. గత ఏడాది కూటమి అధికారంలోకి రావడంతో వైసీపీ నేతల దందాకు అడ్డుకట్ట పడుతుందని భావించారు. కానీ వారి దందా ఏమాత్రం ఆగడం లేదు. చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని ఏపీఐఐసీ భూములు కొందరు వైసీపీ నేతలకు వరంగా మారాయి. ఇక్కడి భూముల్లోని మట్టిని కొల్లగొడుతున్నారు. దీంతో పరిశ్రమలకు ఉపయోగపడాల్సిన భూముల్లో లోతైన గుంతలు ఏర్పడుతున్నాయి.


దీనిపై ఏపీఐఐసీ అధికారులు చింతకొమ్మదిన్నె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మట్టి తరలింపుపై నిఘా ఉంచారు. బుధవారం మట్టిని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం రావడంతో ఇండస్ట్రియల్‌ అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు. అప్పటికే అక్రమార్కులు పలు ట్రాక్టర్లను సంఘటనా స్థలం నుంచి తరలించినట్లు సమాచారం. అధికారుల దాడుల్లో కేవలం ఒక ట్రాక్టర్‌, రొటోవేటర్‌ మాత్రమే పట్టుబడ్డాయి.


ఆ వాహనాలను చింతకొమ్మదిన్నె పోలీస్టేషన్‌కు తరలించారు. ఆ వాహనాలు ఓ వైసీపీ ప్రజాప్రతినిధివని అంటున్నారు. దీనిపై కడప రూరల్‌ సీఐ బాలమద్దిలేటి మాట్లాడుతూ.. మట్టి తరలింపుపై ఏపీఐఐసీ అధికారులతో పాటు, స్థానికులు ఫిర్యాదు చేశారని అన్నారు. ఈ మేరకు నిఘా ఉంచి బుధవారం ఏపీఐఐసీ భూముల్లో అక్రమంగా మట్టిని తరలిస్తున్న రొటోవేటర్‌తో పాటు ట్రాక్టర్‌ను పట్టుకొని మైన్స్‌శాఖకు అప్పగించామని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వంశీకి ఊహించని షాక్.. మరో కేసు నమోదు

గవర్నర్‌ను కలవనున్న జగన్.. పోలీసులు అలర్ట్

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 19 , 2025 | 09:32 AM