Share News

DSP Office: డీఎస్పీ కార్యాలయం ఎదుట తండా వాసుల ఆందోళన

ABN , Publish Date - Jan 02 , 2026 | 11:41 AM

అప్పు చెల్లించాలంటూ తీసుకున్న వ్యక్తిని వేధింపులకు గురి చేయడంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అతడి భార్యతోపాటు తండా వాసులు పోలీస్ ఉన్నతాధికారి కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

DSP Office: డీఎస్పీ కార్యాలయం ఎదుట తండా వాసుల ఆందోళన

కడప, డిసెంబర్ 02: తన భర్త మృతికి సుధాకర్ నాయక్‌తోపాటు సీకే దిన్నే పోలీసులే కారణమని ఆరోపిస్తూ మహేంద్ర నాయక్ భార్య సౌజన్యతోపాటు జీజీఎస్ తండా వాసులు శుక్రవారం కడప డీఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ డీఎస్పీని వారు డిమాండ్ చేశారు. దీంతో కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కడప జిల్లా జీజీఎస్ తండాకు చెందిన మహేంద్ర నాయక్ గతంలో అప్పు చేశారు. ఆ అప్పు తీర్చాలంటూ అతడిపై అప్పు ఇచ్చిన వారు తరచూ ఒత్తిడికి గురి చేస్తున్నారు. వారి వేధింపులు తాళలేక.. జీజీఎస్ తండాకు చెందిన మహేంద్ర నాయక్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.


దీంతో తన భర్త మృతికి అప్పు ఇచ్చిన సుధాకర్ నాయక్, సీకే దిన్నే పోలీసులే కారణమని వారు ఆరోపిస్తున్నారు. తీసుకున్న అప్పు చెల్లించకుంటే చంపేస్తానంటూ సుధాకర్ నాయక్.. తన భర్తను బెదిరించాడని మహేంద్ర నాయక్ భార్య సౌజన్య తెలిపింది. తమకు న్యాయం చేయకుంటే .. ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దీంతో డీఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కలెక్టర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..

కుమారుడితో కలిసి నూతిలో దూకిన తల్లి.. ఇద్దరు మృతి

For More AP News And Telugu News

Updated Date - Jan 02 , 2026 | 11:47 AM