Home » Andhra Pradesh » Guntur
దశాబ్దాలుగా ఇళ్ల హక్కుల కోసం ఎదురుచూస్తున్న వేలాది పేద కుటుంబాల కలను సాకారం చేస్తున్నామంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పర్యటించారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా వాద్ నగర్ సేవా సంకల్ప అభియాన్ యాత్రలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పలువురు కేంద్ర మంత్రులతో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.
గణేశ్ నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా డీజే వాహనాలకు అనుమతుల విషయంలో ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి నారా లోకేశ్ సూచించారు. హోంమంత్రి అనిత, డీజీపీ జోక్యం చేసుకుని అనుమతుల ప్రక్రియను సులభతరం చేయాలని విజ్ఞప్తి చేశారు.
భారతదేశాన్ని అభివృద్ధి దిశగా ప్రధాని నరేంద్ర మోదీ తీసుకెళ్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రధాని నిర్ణయాలతో 25 ఏళ్లలో భారత్ మరింత అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నేడు ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
రాష్ట్రంలోని అన్ని రంగాలు, వర్గాలను బలోపేతం చేసేలా బ్యాంకులు విస్తృతంగా రుణాలు అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు. 236వ ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో బ్యాంకర్లు, అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలో వీఏఎస్ పోస్టుల భర్తీకి సంబంధించి జరుగుతున్న ప్రచారంపై పశుసంవర్ధక శాఖ స్పందించింది. కావాలనే ఈ విషయమై అసత్య ప్రచారం జరుగుతోందని స్పష్టం చేసింది.
ఆసియా క్రీడల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్న 'జ్యోతి యర్రాజీ'కి ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ ‘ఆల్ ది బెస్ట్’ తెలిపారు. ఈ మేరకు ఎక్స్(X)లో మంత్రి పోస్టు పెట్టారు.
పోలీస్ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పోలీసు శాఖలో 2,050 పోస్టుల భర్తీకి ఏపీ సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 378 ఎస్ఐ, 1,156 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది.
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. అందులో భాగంగా మరో 12 కార్పొరేషన్లు, 29 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది.