Share News

CM Chandrababu Naidu: హిందూజా గ్రూప్ చైర్మన్ మృతి.. సంతాపం తెలిపిన సీఎం, మంత్రి లోకేశ్

ABN , Publish Date - Nov 04 , 2025 | 10:12 PM

హిందూజా గ్రూప్ చైర్మన్ పి గోపిచంద్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు.

CM Chandrababu Naidu: హిందూజా గ్రూప్ చైర్మన్ మృతి.. సంతాపం తెలిపిన సీఎం, మంత్రి లోకేశ్

అమరావతి,నవంబర్ 04: హిందూజా గ్రూప్ చైర్మన్ పి గోపిచంద్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. విజన్ ఉన్న పారిశ్రామికవేత్తగా ఈ గ్రూప్‌ను ఆయన ప్రపంచ స్ధాయికి తీసుకు వెళ్లారని తెలిపారు.ఈ గ్రూప్ చైర్మన్ గోపిచంద్.. గొప్ప నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తిగా అభివర్ణించారు. 1984లో గల్ఫ్ ఆయిల్‌ను కైవసం చేసుకోవడం మొదలు.. అశోక్ లైల్యాండ్‌ను తిరిగి పునరుద్దరించడం వరకు ఆయన సేవలు చిరస్మరణీయమని వివరించారు.


విద్యుత్, మౌలిక వసతుల్లోకి ఈ గ్రూప్‌‌ను తీసుకురావడంలో ఆయన చేసిన కృషి ఆపారమని చెప్పారు. ఆయన స్ఫూర్తి తర్వాత తరాలకు సైతం మార్గదర్శనం కావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు, ఆ కుటుంబ స్నేహితులకు, హిందూజా గ్రూప్‌నకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం స్పందించారు.


అలాగే హిందుజా గ్రూప్ సంస్థ చైర్మన్ గోపిచంద్ మృతిపై ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ సైతం తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. హిందూజా గ్రూప్ చైర్మన్ పి గోపిచంద్ మరణం..తమకు బాధ కలిగించిందన్నారు. పరిశ్రమతోపాటు దాతృత్వానికి ఆయన చేసిన విశేష కృషిని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఈ సందర్భంగా గోపిచంద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్‌కు చురకలంటించిన నారా లోకేశ్

అబద్దాలతో కాలం గడిపిన జగన్: దేవినేని ఉమా

For More AP News And Telugu News

Updated Date - Nov 04 , 2025 | 10:25 PM