ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం మంగపతి దేవి పేట గ్రామంలో పెద్దపులి సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
‘ఆంధ్రజ్యోతి’ కథనంతో ఆ బడికి వెలుగులు ప్రసరించనున్నాయి! విద్యార్థులకు వసతి సమస్య తీరి పక్కాభవనాలు రానున్నాయి. పోలవరం జిల్లా నూతనంగా ఏర్పడిన గుర్తేడు మండలం బొడ్డగండి గ్రామపంచాయతీ పరిధిలోని మెట్టగూడెం గిరిజన ప్రాథమిక పాఠశాలలో 51మంది గిరిజన విద్యార్థులు చదువుతున్నప్పటికీ, పక్కా భవనం లేక రేకుల షెడ్డులోనే విద్యాభ్యాసం కొనసాగుతోంది.
పోలవరం జిల్లాలోని రంపచోడవరంలో 10వ తరగతి విద్యార్థిని ముర్రం శివాని ఆత్మహత్యపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని ఆత్మహత్యను పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు.
పోలవరం జిల్లాలోని రంపచోడవరం మండలం ఇర్లపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. పదో తరగతి చదువుతోన్న శివాని అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో విద్యార్థిని ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
పిల్లలు ఆనందంగా చదువుకోవడానికి ఏర్పాట్లు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విద్యా వ్యవస్థకు ఉపాధ్యాయులే వెన్నెముక అని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు తాను మాట ఇచ్చానని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం పోలవరం జిల్లా రంపచోడవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ హైస్కూలు, జూనియర్ కళాశాలలో విద్యార్థులు, వారి తల్లితండ్రులతో ముఖ్యమంత్రి ముఖాముఖి సమావేశం నిర్వహించారు.
పోలవరం జిల్లాలోని జాగరంపల్లిలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు, పార్టీ కార్యకర్తలను కలిసి వారి నుంచి వినతిపత్రాలను స్వీకరించారు.
డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో నిందితుడు, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు ఏసీబీ కోర్టులో మరో ఎదురు దెబ్బ తగిలింది. జైలులో తనకు బీ కేటగిరి వసతులు కల్పించాలన్న అతడు దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది.
పేదరికం ప్రతిభకు అడ్డుకాదని నిరూపించింది తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థిని కందుల జెస్సీ. ప్రపంచంలోనే తొలి ఆల్-గర్ల్స్ లూనార్ క్యూబ్శాట్ మిషన్ 'మిషన్ శక్తి శాట్'కు ఆమె ఎంపికై రికార్డు సృష్టించింది.