Share News

భారత్‌లోను బౌద్ధ మత వ్యాప్తి

ABN , Publish Date - Jan 26 , 2026 | 12:45 AM

ఉండ్రాజవరం, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): పలు దేశాల్లో బౌద్ధ మత వ్యాప్తి జరుగుతోందని, భారతదేశంలో కూడా జరగాలని రాబోయే రోజు ల్లో కార్యాచరణ ఏర్పాటు చేస్తాం. ఉండ్రాజవరం లో బౌద్ధ ఆరామం నిర్మించడంలో భంతేజీ అనా లయో పాత్ర అభినందనీయమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖామంత్రి

భారత్‌లోను బౌద్ధ మత వ్యాప్తి
ఉండ్రాజవరంలో బౌద్ధరామంలో మంత్రి దుర్గేష్‌

ఉండ్రాజవరంలో బౌద్ధరామం నిర్మాణం

భంతేజీ అనాలయో పాత్ర అభినందనీయం

మంత్రి కందుల దుర్గేష్‌

ఉండ్రాజవరం, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): పలు దేశాల్లో బౌద్ధ మత వ్యాప్తి జరుగుతోందని, భారతదేశంలో కూడా జరగాలని రాబోయే రోజు ల్లో కార్యాచరణ ఏర్పాటు చేస్తాం. ఉండ్రాజవరం లో బౌద్ధ ఆరామం నిర్మించడంలో భంతేజీ అనా లయో పాత్ర అభినందనీయమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖామంత్రి కందుల దుర్గేష్‌ పేర్కొన్నారు. ఆదివారం తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరంలో మైత్రేయ బుద్ద విహార్‌ కలశ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. బౌద్ధరామం ఏర్పాటుతో దేశంలోనే గుర్తింపు వచ్చేందుకు అనాలయో కృషి చేయాలని తెలిపారు. దేశంలోనే కాకుండా ప్రపంచలోని పలు దేశాల్లో బౌద్ధ ధర్మం ఆదరణ పొందినట్లు చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో అనేక బౌద్ధ పురాతన ఆలయాలు ఉన్నప్పటికీ, ఆధునికి ఆలయం భంతేజీ అనాలయో నిర్మించడం ఎంతో ముదావహమని చెప్పారు. రాష్ట్రంలో నాగార్జునసాగర్‌, అమరావతి ప్రాంతాల్లో బౌద్ధ ధర్మం వ్యాప్తిలో ఉందన్నారు. ఉండ్రాజవరంలో బౌద్ధ దమ్మపీఠం ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ఈ ప్రాంతానికి సీఎం చంద్రబాబును తీసుకురావాలని భంతేజీ అనాల యో కోరారని, తప్పనిసరిగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తానని మంత్రి పేర్కొన్నారు. స్థాని క బౌద్ధ దమ్మ పీఠాధిపతి భంతేజీ అనాలయో మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండ్రాజవరం లోనే మేత్రయ బుద్ద విహార్‌ పేరు తో ఆరామం ఏర్పాటు చేసిన ట్లు తెలిపారు. తొలుత త ణుకులో అంబేడ్కర్‌ విగ్ర హం వద్ద నుంచి ఉండ్రాజవరం వ రకు దేశంలోని పలు ప్రాం తాల నుంచి వచ్చిన బౌద్ధ భిక్షువులు, ప్రజలు శాంతి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ, ఏపీఎస్‌ఎస్‌డీసీ చైర్మన్‌ బూరుగుపల్లి శేషారావు ప్రారంభించారు. తణుకు మండలంలోని పాలం గి మీదుగా ఉండ్రాజవరం వరకు కలశ రథంలోపాటు 130 మీటర్ల బౌద్ధ పతాకంతో శాంతిర్యాలీ నిర్వహించారు. మంత్రి పూజ చేసి కలశ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బౌద్ధ భిక్షువులతో కలశ పూజ, పూజ్య భిక్ష సంఘానికి భోజన దా నం, బౌద్ద ఉపాసిక, ఉపాసకులకు కలశ దర్శనం చేశారు. మాజీ సర్పంచ్‌ గన్నమని వెంకటసుబ్రహ్మణ్యం, మాజీ జడ్పీటీసీ కోమట్లపల్లి వెంకటసుబ్బారావు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 26 , 2026 | 12:45 AM