Share News

ఏబీఎన్ ఎఫెక్ట్: అన్నవరం ప్రసాదం బుట్టలో ఎలుకలు.. అధికారుల చర్యలివే

ABN , Publish Date - Jan 24 , 2026 | 02:54 PM

అన్నవరం ప్రసాదం బుట్టలో ఎలుకల వ్యవహారంపై స్పందించిన ఉన్నతాధికారులు.. ఇద్దరు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు. ప్రసాదం కౌంటర్‌ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.

ఏబీఎన్ ఎఫెక్ట్: అన్నవరం ప్రసాదం బుట్టలో ఎలుకలు.. అధికారుల చర్యలివే
Annavaram Temple

కాకినాడ, జనవరి 24: అన్నవరం ప్రసాదం బుట్టలో ఎలుకల వ్యవహారంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో(ABN Andhrajyothy) వచ్చిన కథనాలపై ఉన్నతాధికారులు స్పందించారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇద్దరు దేవస్థానం ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ప్రసాదం బుట్టలపై ఎలుకలు ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులపై ఈ మేరకు చర్యలు చేపట్టిన ఆలయ ఈఓ త్రినాథరావు.. త్రిమూర్తులు, రాజు అనే ఇద్దరినీ విధుల నుంచి తొలగించారు. అంతేకాకుండా ప్రసాదం కౌంటర్లోకి ఎలుకలు చొరబడకుండా ఉండేందుకు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు అధికారులు. కౌంటర్‌పై నుంచీ ఎలుకలు ప్రవేశించకుండా సీలింగ్ కూడా నిర్మించాలని నిర్ణయించారు.


ఇదీ జరిగింది..

అన్నవరం దేవస్థానంలో భక్తులకు విక్రయించే ప్రసాదాల విషయమై ఇటీవల ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెలువడిన ఓ కథనం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రసాదాలు విక్రయించే బుట్టల్లో యథేచ్చగా ఎలుకలు తిరుగుతున్నా.. ఆలయ సిబ్బంది ఏమాత్రం పట్టించుకోని పరిస్థితి. ఇటీవల కొందరు భక్తులు అన్నవరం హైవేపై ప్రసాదాలు కొనుగోలు చేస్తూ.. ఈ విషయమై ప్రశ్నించగా సిబ్బంది నిర్లక్ష్యంగా ప్రతిస్పందించారు. ఈ వ్యవహారంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు రావడంతో అధికారులు నష్ట నివారణ చర్యలు చేపట్టారు.


ఇవి కూడా చదవండి...

నేటి నుంచి షోరూం వద్దే వాహన రిజిస్ట్రేషన్‌

4 రోజులు 45 భేటీలు.. లోకేశ్ దావోస్ టూర్ సక్సెస్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 24 , 2026 | 03:53 PM