Share News

నరసన్న పెళ్లి కొడుకాయెనే..

ABN , Publish Date - Jan 26 , 2026 | 12:39 AM

అంతర్వేది, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ఆర్తజన రక్షకుడు అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి కల్యాణోత్సవాలు ఆదివారం రథసప్తమి రోజున వైభవంగా ప్రారంభమయ్యాయి. వార్షికంగా కేశవదాసుపాలెనికి చె ందిన బెల్లంకొండ, ఉండపల్లి కుటుంబీకులు తొలిపూజలు చేశారు. స్వామికి పంచామృతాల

నరసన్న పెళ్లి కొడుకాయెనే..
స్వామివారి, అమ్మవార్లను అలంకరిస్తున్న పండితులు

వైభవంగా ప్రారంభమైన అంతర్వేది లక్ష్మీనరసింహుడి కల్యాణోత్సవాలు

తొలిరోజు సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలపై గ్రామోత్సవాలు

అధికసంఖ్యలో తరలివచ్చిన భక్తులు

అంతర్వేది, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ఆర్తజన రక్షకుడు అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి కల్యాణోత్సవాలు ఆదివారం రథసప్తమి రోజున వైభవంగా ప్రారంభమయ్యాయి. వార్షికంగా కేశవదాసుపాలెనికి చె ందిన బెల్లంకొండ, ఉండపల్లి కుటుంబీకులు తొలిపూజలు చేశారు. స్వామికి పంచామృతాలతో అభిషేకాలు జరిపించారు. ఆలయ స్థానాచార్యులు విం జమూరి రామరంగాచార్యులు, ప్రధానార్చకులు పాణింగపల్లి శ్రీనివాసకిరణ్‌, పెద్దింటి శ్రీనివాసాచార్యులు, వేదపండితులు చింతా వెంకటశాస్త్రి, సహఅర్చకులు సత్తిబాబు, పుల్లయ్య ఆ ధ్వర్యంలో స్వామికి వైఖానస ఆగమానుసారం వైష్ణవ సాం ప్రదాయం ప్రకారం పూజలు జరిగాయి. ఉదయం శుప్రభాతసేవ, విశ్వక్షేన పూజ, పుణ్యాహవచనం నిర్వహించారు. తిరువరాధన, బాలభోగం, పంచామృతాభిషేకాలు జరిగాయి. బెల్లంకొండ, ఉండపల్లి కుటుంబాలు సంయుక్త నిర్వాహణలో సాయంత్రం 6.30గంటలకు దూపసేవ అనంతరం ముద్రిక అలంకరణ నిర్వహించారు. విశేష పూజలందుకున్న స్వామి, అమ్మవార్లను అర్చకులు పెళ్లికి సిద్ధం చేశారు. బెల్లంకొండ, ఉండపల్లి కుటుంబీకులు ఉంగరాలు సమర్పించారు. ఉభయకుటుంబాల ఆడపడుచులు హారతులిచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేలాదిమందికి అన్నసమారాధన నిర్వహించారు. అధికసంఖ్యలో భక్తులు స్వామి,అమ్మవార్లను దర్శించుకుని ప్రసాదం స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కమిషనర్‌ వి.సత్యనారాయణ, ఆలయ కమిషనర్‌ ఎం.ప్రసాద్‌, ఆలయ ఫ్యామిలీ ఫౌండర్‌, చైర్మన్‌ రాజా కలి దిండి కుమార రామా గోపాలరాజా బహుద్దూర్‌, ఉత్సవ సేవా కమిటీ చైర్మన్‌ దెందుకూరి రమేష్‌రాజు, ముప్పర్తి నాని, గుబ్బల మణికుమార్‌, ఆకన బాబ్జినాయుడు, వనమాలి మూలస్వామి, తిరుమాని ఆచార్యులు, రావున నాగు, ఉండపల్లి అంజి, బైరా నాగరాజు, వలవల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రథసప్తమి పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు సముద్ర, గోదావరి పుణ్య స్నానాలు ఆచరించారు.

తొలిపూజ రథానికే..

కల్యాణోత్సవాల్లో భాగంగా రథసప్తమి పురస్కరించుకుని మధ్యాహ్నం 2గంటలకు రథాన్ని భక్తులు రాజావారి వీధికి చేర్చారు. తొలుత అర్చకులు రథానికి ప్రత్యేక పూజలు చేశా రు. అలాగే ఆలయ నిర్మాత కొప్పనాతి కృష్ణమ్మ నిలువెత్తు విగ్రహానికి ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌, ఆలయ ఫౌండర్‌, చైర్మన్‌ రాజా బహుద్దూర్‌, ఉత్సవ సేవా కమిటీ చైర్మన్‌ రమేష్‌రాజు, జిల్లా ఏసీ సత్యనారాయణ, కొప్పనాతి కృష్ణమ్మ మనవడు కొప్పనాతి శ్రీనివాస్‌, అగ్నికుల క్షత్రియులు పూలమాలలు వేశారు. అనంతరం రథానికి కొబ్బరికాయ కొట్టి ర థాన్ని లాగి ఉత్సవాన్ని ప్రారంభించారు. పల్లెపాలెం గ్రామానికి చెందిన వాహనకారులు, గ్రామస్తులు భక్తుల రథాన్ని మెరక(రాజావారి) వీధికి చేర్చారు. కల్యాణోత్సవాల్లో భాగం గా తొలిరోజు సాయంత్రం 4గంటలకు శ్రీలక్ష్మీనరసింహుడిని శృంగవరప్పాడు వాస్తవ్యులు అడబాల వెంకన్న కుమారుల తో నిర్మితమైన సూర్యప్రభ వాహనంపై స్వామివారు గ్రామ పురవీధుల్లో విహరించారు. రాత్రి 9గంటలకు చంద్రప్రభ వా హనంపై గ్రామోత్సవం జరిగింది. కేశవదాసుపాలెం గ్రామానికి చెందిన బెల్లంకొండ, ఉండపల్లి, మోరిపోడు వాస్తవ్యులు ముప్పర్తి సుబ్బారావు కుటుంబసభ్యులతో నిర్మితమైన చంద్రప్రభ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు.

Updated Date - Jan 26 , 2026 | 12:39 AM