లోకేశ్..భవిష్యత్ నాయకుడు
ABN , Publish Date - Jan 24 , 2026 | 12:45 AM
రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లో కేశ్ మన భవిష్యత్ నాయకుడు అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. లోకేశ్ పుట్టిన రోజును శుక్రవారం పలుచోట్ల టీడీపీ నాయకులు ఘనం గా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు.స్థానిక కోరుకొండ రోడ్డు రామకృష్ణమఠం వద్ద తెలుగు మహిళలు కేక్‌ను కట్ చేసి కార్యకర్తలకు, నాయకులకు పంచారు.
ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు
ఘనంగా విద్యాశాఖ మంత్రి పుట్టినరోజు
పలుచోట్ల సేవా కార్యక్రమాలు
రాజమహేంద్రవరం సిటీ, జనవరి 23(ఆంధ్ర జ్యోతి): రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లో కేశ్ మన భవిష్యత్ నాయకుడు అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. లోకేశ్ పుట్టిన రోజును శుక్రవారం పలుచోట్ల టీడీపీ నాయకులు ఘనం గా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు.స్థానిక కోరుకొండ రోడ్డు రామకృష్ణమఠం వద్ద తెలుగు మహిళలు కేక్‌ను కట్ చేసి కార్యకర్తలకు, నాయకులకు పంచారు. అనంతరం సుబ్రహ్మణ్యస్వామి ఆలయం వద్ద టీ డీపీ నాయకులు మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దావోస్‌లో ఎము కలు కొరికే చలిలో సైతం బ్లాక్ నుంచి బ్లాక్‌కు నడుస్తూ పెట్టుబడులు వేటాడుతున్నారని, జాబ్ క్రీయేటర్‌గా నిలుస్తున్నారన్నారు.రాష్ట్ర భవిష్యత్తు కోసం లక్ష కోట్లు పెట్టుబడి, లక్షల ఉద్యోగాల సం కల్పంతో ఉన్నారన్నారు. అనంతరం రైతు బజార్ లో జూట్ బ్యాగ్‌లను పంచారు. లాలాచెరువు సెంటర్‌లో లోకేశ్ పుట్టినరోజు జరిగింది. ఇదిలా ఉండగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ స్థానిక ప్రియదర్శిని బధిరుల పాఠశాల విద్యా ర్థులకు అల్పాహారాన్ని అందించారు.తొలుత కేక్ ను కాశి నవీన్‌కుమార్ కట్ చేశారు. అనంత రం పేద దివ్యాంగురాలికి ట్రైసైకిల్‌ను గన్ని కృష్ణ అం దించారు.రాష్ట్రాభివృద్ధికి లోకేశ్ నిరంతరం శ్రామికుడిగా పనిచేస్తున్నారన్నారు. స్థానిక రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ ప్రాంతీయ కార్యాలయంలో చైర్మన్ కుడుపూడి సత్తిబాబు ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు బియ్యం ప్యాకెట్లు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. రాజమహేంద్రవరం క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి ఆలయంలో టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ యర్రా వేణుగోపాలరాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమాల్లో టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, రెడ్డి మణి, నక్కా చిట్టిబాబు, నిమ్మలపూడి గో వింద్, పెనుగొండ రామకృష్ణ, వర్రే శ్రీనివాసరావు, మరుకుర్తి రవియాదవ్, మాలే విజయలక్ష్మి,కోసూరి చండీప్రియ, ద్వారా పార్వతి సుం దరీ,కప్పల వెలుగు,తురకల నిర్మల పాల్గొన్నారు.