Share News

ప్రమాదపుటంచున ప్రయాణాలు

ABN , Publish Date - Jan 23 , 2026 | 01:35 AM

మండలంలోని పలు గ్రామాల పరిధిలోని ఆర్‌అండ్‌బీ రహదారుల్లో ప్రధాన పంటకాలువలపై నిర్మించిన వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మండలంలోని వెదురుమూడి ప్రధాన పంట కాలువపై నిర్మించిన పెద్ద వంతెన, బ్రిటీష్‌ హయాంలో వెదురుమూడిలోని టేకి డ్రైన్‌పై ఉన్న వంతెనలు రక్షణగోడలు విరిగిపోవడం, ఇనుప ఊచలు తుప్పుపట్టి ప్రమాదభరితంగా మా రడంతో నిత్యం ఆ మార్గాల్లో వంతెనలపై నుంచి వెళుతు న్న బస్సులు, ఆటోలు, లారీలు, ద్విచక్ర వాహనదారులు, ప్రయాణికులు ఎప్పుడూ కూలిపోతయో, ఏ ప్రమాదం జరుగుతుందోనని భయం గుప్పిట్లో ప్రయాణాలు సాగిస్తున్నారు.

ప్రమాదపుటంచున ప్రయాణాలు
సత్యనారాయణపురం వద్ద రెయిలింగ్‌ లేకపోవడంతో వంతెనకు కట్టిన క్లాత్‌

  • రెయిలింగ్‌ విరిగిపోయి ప్రమాదకరంగా మారిన వంతెనలు

  • భయాందోళనలో వెదురుమూడి, టేకి, సత్యనారాయణపురం వాసులు

  • పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

కపిలేశ్వరపురం, జనవరి 22(ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామాల పరిధిలోని ఆర్‌అండ్‌బీ రహదారుల్లో ప్రధాన పంటకాలువలపై నిర్మించిన వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మండలంలోని వెదురుమూడి ప్రధాన పంట కాలువపై నిర్మించిన పెద్ద వంతెన, బ్రిటీష్‌ హయాంలో వెదురుమూడిలోని టేకి డ్రైన్‌పై ఉన్న వంతెనలు రక్షణగోడలు విరిగిపోవడం, ఇనుప ఊచలు తుప్పుపట్టి ప్రమాదభరితంగా మా రడంతో నిత్యం ఆ మార్గాల్లో వంతెనలపై నుంచి వెళుతు న్న బస్సులు, ఆటోలు, లారీలు, ద్విచక్ర వాహనదారులు, ప్రయాణికులు ఎప్పుడూ కూలిపోతయో, ఏ ప్రమాదం జరుగుతుందోనని భయం గుప్పిట్లో ప్రయాణాలు సాగిస్తున్నారు. అలాగే టేకి డ్రైన్‌పై నిర్మించిన కాలిబాట వంతెన సగభాగం విరిగిపోవడంతో మిగిలిన సగభాగంలోనే బిక్కుబిక్కుమంటూ ప్రయాణాలు చేస్తున్నారు. కపిలేశ్వరపురం శివారు సత్యనారాయణఫురం వద్ద కాలిబాట వంతెన రక్షణ గోడలు విరిగిపోవడం, వంతెనపైకి వెళ్లే మార్గం, వంతెన పైభాగం మొత్తం దెబ్బతినడంతో ఇదే పరిస్థితి నెలకొంది. వంతెన నుంచి పడిపోకుండా ఉండేందుకు కాం పౌండ్‌ క్లాత్‌ కట్టారు. ఈ మార్గాలగుండా మం డల ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల వాసులు ఈ వంతెనలపై భయం గుప్పిట్లో ప్రయాణాలు సాగిస్తున్నారు. వంతెనలు చాలా వరకు దెబ్బతినడంతో ఎప్పు డు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఎంతోకాలం గా ఈ పరిస్థితి ఉన్నా అధికారులు, ప్రజాప్రతినిధులు వీటిపై దృష్టి సారించకపోవడం పట్ల పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా స్పం దించి శిథిలావస్థకు చేరిన వంతెనల సమస్యలను పరిష్కరించాలని ఆయా గ్రామస్థులు, ప్రయాణికులు, వాహనదారులు కోరుతున్నారు.

Updated Date - Jan 23 , 2026 | 01:35 AM