‘ముక్కామల’..ఆకట్టుకునేలా!
ABN , Publish Date - Jan 27 , 2026 | 12:57 AM
అంబాజీపేట, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలో జరిగిన శకటాల ప్రదర్శన కార్యక్రమంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ముక్కామలకు చెందిన పసుపులేటి నాగబాబు కళాకారుల బృందం సభ్యులు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నా
ఢిల్లీలో గణతంత్ర వేడుకల్లో పసుపులేటి నాగబాబు కళాకారుల బృందం ప్రదర్శన
అంబాజీపేట, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలో జరిగిన శకటాల ప్రదర్శన కార్యక్రమంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ముక్కామలకు చెందిన పసుపులేటి నాగబాబు కళాకారుల బృందం సభ్యులు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. దేశ నలుమూలల నుంచి వచ్చిన దాదాపు 220 మంది కళాకారులతో నిర్వహించిన హెరాల్డింగ్ ప్రోగ్రామ్‌లో ఆంధ్రప్రదేశ్ తరుపున బృంద సభ్యుడు పసుపులేటి కుమార్ ఆధ్వర్యంలో 20 మంది కళాకారుల బృందం దేశ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి దౌప్రతిముర్ము ఎదుట ప్రదర్శనను అ ందించారు. భారత సంస్కృతిక మంత్రిత్వ శాఖ, సంగీత నాటక అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో నాదశ్వరం, డోలు, తాషా, వీరణం, తప్పెటగుళ్లుతో కళాకారులు ఆకట్టుకున్నారు. ఢిల్లీలో జరిగిన రిప్లబిక్ వేడుకల్లో వరుసగా ఈ ఏడాదితో పుసుపులేటి నాగబాబు కళాకారుల బృందం నాల్గోసారి పాల్గొంది.