నిరూపయోగంగా క్రీడా వికాస కేంద్రం
ABN , Publish Date - Jan 24 , 2026 | 12:54 AM
సీతానగరంలోని ప్రభుత్వోన్నత పాఠశాల ఆవ రణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన క్రీ డా వికాస కేంద్రం అధికారుల నిర్లక్ష్యంతో నిరూపయోగంగా మారింది.
సీతానగరం, జనవరి 23(ఆంధ్రజ్యోతి): సీతానగరంలోని ప్రభుత్వోన్నత పాఠశాల ఆవ రణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన క్రీ డా వికాస కేంద్రం అధికారుల నిర్లక్ష్యంతో నిరూపయోగంగా మారింది. 2018లో తెలుగుదేశం ప్రభుత్వం రూ.2 కోట్లతో ప్రారంభిన క్రీడా వికాస కేంద్రానికి తదుపరి వైసీపీ ప్రభుత్వం మరో రూ.5 కోట్లు వెచ్చించి ఎన్నికల సమయంలో హడావుడిగా ప్రా రంభోత్సవం చేసింది. అయితే అప్పటికీ కేంద్రం ఆటలకు పని కొచ్చే స్థితిలో లేదు. బిల్డింగ్‌లో వర్గం నీరు పడడం, కిటికీలు, ద్వారబంధాలు పాడవడంతో మరమ్మతులు చేపట్టారు. కాని ఇంతవరకు క్రీడా ప్రియులకు అందుబాటులోకి రాలేదు.దీనిపై ఆర్‌అండ్‌బీ ఇంజనీరు వీరబాబును వివరణ కోరగా క్రీడా ప్రాంగణానికి మ రమ్మతులు చేసి స్పోర్ట్స్ అథారిటికి అప్పగించామన్నారు.కాని ఇంతవరకు ఎలాంటి చర్య ల్లేవు. ఈ క్రీడా ప్రాంగణాన్ని తెరచి, క్రీడలకు ఉపయోగపడేలా చేసి అందుబాటులోకి తేవా లని క్రీడాకారులు, స్థానికులు కోరుతున్నారు.