సినీనటుడు మాగంటి మురళీమోహన్‌కు పద్మశ్రీ అవార్డు
ABN , Publish Date - Jan 26 , 2026 | 12:40 AM
రాజమహేంద్రవరం, జనవరి 25 (ఆంధ్ర జ్యోతి): ప్రముఖ సినీ నటుడు, రాజ మండ్రి మాజీ ఎంపీ మాగంటి మురళీ మోహన్‌కు పద్మశ్రీ అవార్డు లభిం చింది. కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఈ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. నటుడిగా, నిర్మాతగా ఆయన 60 ఏళ్ల కృషిలో 350 కంటే అధి కంగా సినిమాలు చేశా
రాజమహేంద్రవరం, జనవరి 25 (ఆంధ్ర జ్యోతి): ప్రముఖ సినీ నటుడు, రాజ మండ్రి మాజీ ఎంపీ మాగంటి మురళీ మోహన్‌కు పద్మశ్రీ అవార్డు లభిం చింది. కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఈ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. నటుడిగా, నిర్మాతగా ఆయన 60 ఏళ్ల కృషిలో 350 కంటే అధి కంగా సినిమాలు చేశారు. అంతేకాక ఆ రో గ్యం, విద్యారంగాల్లో సేవలను విస్తరించా రు. ఈ నేపథ్యంలో ఆయననకు పద్మశ్రీ అ వార్డు లభించింది 2014-19 మధ్య రాజ మండ్రి నుంచి తెలుగుదేశం పార్టీ ఎంపీగా బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. సినీ నటుడిగా తెలుగు ప్రజలకు సుపరి చరిస్తుడైన మురళీమోహన్ రాజమహేంద్ర వరం పార్లమెంటరీ ప్రజలకు ఎంపీగా బాగా తెలిసిన నేత. ఆయన ఈప్రాంత ప్రజలతో చాలా సన్నిహితంగా ఉండేవారు. మురళీ మోహన్‌కు పద్మశ్రీ లభించడం పట్ల ఈ ప్రాంత ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. ఆ యన ఎంపీగా సైన్స్ మ్యూజియం ఏర్పాటు కు కృషి చేశారు. ఇంకా ఈ ప్రాంత గుర్తింపు కోసం ఎంపీగా ఆయన పలు సేవలు అంది ంచిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదు.