అమలాపురం, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): మూడో ప్రపంచ తెలుగు మహాసభలకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపు
అంతర్వేది, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటైన అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక దివ్య, తిరు కల్యాణ మహోత్సవాలకు శుభ ముహూర్తం ఖరారైంది. తొలుత అర్చకులు, స్థానాచార్యులు, వేదపండితులు ఆలయ సహాయ కమిషనర్ ఎంకేటీఎన్వీ ప్రసాద్‌కు ముహూర్తపు పత్రికను ఆదివారం అందించారు. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు స్వామివారి వార్షిక కల్యాణ మహోత్సవాలు జరగనున్నాయి.
రాష్ట్రంలోని రైస్ మిల్లర్లంతా సంఘటితంగా ఐక మత్యంతో మెలగాలని రైస్ మిల్లర్స్ అసోసియే షన్ రాష్ట్రాధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. రాజానగరంలోని రాయల్ ఫం క్షన్ హాల్లో ఆదివారం జరిగిన రైస్ మిల్లర్ల అసో సియేషన్ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీ కారోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు.
ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక లింగంపేట వాంబేకాలనీలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు.
అన్నవరం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో భక్తు లు గంటలతరబడి క్యూలైన్లలో నిరీక్షణ లేకుండా సేవలన్నింటికీ ఆన్లైన్ ద్వారా టిక్కెట్లు పొందవచ్చని ఈవో వీర్ల సుబ్బారావు తెలిపారు. వ్రతం టిక్కెట్లు, వసతిగదులు, దర్శనాలు, ప్రసాదాల కొనుగోలు వీటన్నింటికీ ప్ర
కాకినాడ క్రైం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన పలు చోరీ కేసుల్లో 12 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి రూ.59.60 ల
అమలాపురం టౌన్, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): కళ్లు లేవని కలత చెందలేదు. కాళ్లు లేవని వెనుకడుగు వేయలేదు. దివ్యాంగులు ఎందులోను తక్కువ కాదని నిరూపిస్తూ ముందడగు వేశారు. డిసెంబరు 3న అంతర్జాతీయ విభిన్న ప్రతిభావ ంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా క్రీడా ప్రాధికా
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా టిడ్కో ఇళ్లు రద్దయిన వారి డబ్బులు రూ.10.20 కోట్ల మేర పేరుకుపోయాయి. ఆ రిఫండ్ డబ్బులు వస్తాయో రావో అన్నట్టుగా పరిస్థితి మారింది. నిధుల విడుదలకు ఆయా మునిసిపాలిటీల వారీగా ఎమ్మెల్యేలు సైతం ప్రయత్నం చేస్తున్నా అమరావతిలో టిడ్కో ఉన్న తాధికారులు మాత్రం ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు.
జిల్లాలోని ఎస్సీ హాస్టళ్లలో మెనూ సక్రమంగా అమలు చేయడంతోపాటు విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, విద్యార్థులను వేధింపులకు గురిచేస్తున్న ఎస్సీ కాలేజీ బాలుర హాస్టల్ నెం.1 లేడీ వార్డెన్‌ను సస్పెండ్ చేయాలని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) నాయకులు డిమాండ్ చేశారు.ఈ మేరకు శుక్రవారం స్థానిక జిల్లా సాంఘిక సంక్షేమాధికారి (డీఎస్డబ్ల్యువో) కార్యాలయం, సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన ధర్నా చేశారు.
ఇటీవల జరిగిన ఇరిగేషన్ సలహా మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అమలుతీరుపై జిల్లా కలెక్టర్ మహేష్‌కుమార్ శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్సు హాలులో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షించారు. ముఖ్యంగా ఇరిగేషన్, డ్రెయిన్స్, రెవెన్యూ, వ్యవసాయశాఖల అధికారులు సమన్వయంతో రానున్న రబీ సీజన్లో సాగు నీటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పూర్తిస్థాయిలో నీటిని అందించాలని ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.