Share News

సత్యదేవుడి సన్నిధిలో కోటి తులసిపత్రి పూజ

ABN , Publish Date - Feb 07 , 2026 | 12:51 AM

అన్నవరం, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో కోటితులసిపత్రి పూజ శుక్రవారం ఘనంగా ప్రార ంభమైంది. ఉదయం 8గంటలకు స్వామివారి వార్షిక కల్యాణ వేదికపై స్వామి,అమ్మవార్లను మే ళతాలాల నడుమ వెండి సింహాసనంపై ఆశీ నులు గావించి ప్రధానార్చకు

సత్యదేవుడి సన్నిధిలో కోటి తులసిపత్రి పూజ
పూజ నిర్వహిస్తున్న రుత్విక్‌లు

ఘనంగా ప్రారంభం

ఈనెల 15 వరకు ప్రత్యేక కార్యక్రమాలు

అన్నవరం, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో కోటితులసిపత్రి పూజ శుక్రవారం ఘనంగా ప్రార ంభమైంది. ఉదయం 8గంటలకు స్వామివారి వార్షిక కల్యాణ వేదికపై స్వామి,అమ్మవార్లను మే ళతాలాల నడుమ వెండి సింహాసనంపై ఆశీ నులు గావించి ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మ ణ్యం ఆధ్వర్యంలో పండితులు గణపతి పూజ చే పట్టారు. పుణ్యాహవచనం, రుత్విక్‌వరుణలు, మంటపారధనలు 60 మంది రుత్విక్‌లతో కార్యక్రమం ప్రారంభించారు. ఈవో త్రినాథరావు, చైర్మ న్‌ రోహిత్‌ పవిత్ర తులసిదళాలను స్వామి,అమ్మవార్లకు సమర్పించారు. 10రోజుల పాటు జరిగే ఈ మహాత్తర కార్యక్రమంలో రోజుకు 10లక్షల తులసిదళాలతో స్వామిని అర్చించనున్నారు. అ ధికసంఖ్యలో భక్తులు టిక్కెట్లను తీసుకుని తులసిపత్రి పూజలో పాల్గొన్నారు. ఇప్పటికే రూ.9 లక్షలు తులసిపత్రి పూజకు విరాళాలుగా లభించినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తుల కు అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వార్షిక కల్యాణ మండపంలో లింగార్చన, సూర్యనమస్కారములు, వేదపారాయణలు నిర్వహించారు. రాత్రి 7గంటలకు మహానివేదన గావించి నీరాజన మంత్రపుష్పములు, కైవార్యములు, చతుర్వేదస్వస్తి, ప్రసాద వితరణ గావించారు. ఈ కార్యక్రమాలు 15వతేదీ మహాశివరాత్రి పర్వదినాన రుద్రహోమ పూర్ణాహుతితో ముగుస్తాయి.

వనదుర్గ ఆలయంలో చండీహోమం

రత్నగిరి క్షేత్రరక్షకిగా పూజలందుకుంటున్న వనదుర్గ ఆలయంలో శుక్రవారం చండీహోమం ఘనంగా జరిగింది. ఉదయం 9గంటల కు పండితులు గణపతిపూజ, పుణ్యాహవచనం అనంతరం అమ్మవారికి చండీ, సప్తసతి పారాయణలు, మూలమంత్రజపములు పఠించారు. 11గంటల కు పవిత్ర హోమగుండంలో సుగంధద్రవ్యాలను అర్పించి పూర్ణాహుతి గావించారు. చతుర్వేదపండితుల వేదాశీర్వచనాలు అనం తరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

Updated Date - Feb 07 , 2026 | 12:51 AM