Share News

సినిమా చూసొద్దామని పయనం.. దారిలోనే దారుణం!

ABN , Publish Date - Feb 03 , 2026 | 01:00 AM

కొవ్వూరు, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): సినిమా చూసొద్దామని సరదాగా బయలుదేరారు ముగ్గురు యువకులు. కానీ దారిలోనే మృత్యువు మింగేసింది. సినిమాకు వెళ్లిన వారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబసభ్యులకు కన్నీరే మిగిలి ంది. ఈ విషాద సంఘటన తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు రో

సినిమా చూసొద్దామని పయనం.. దారిలోనే దారుణం!
సంఘటనా స్థలంలో మృతదేహాలు, బైక్‌

ఎదురెదురుగా రెండు మోటారుసైకిళ్లు ఢీకొని ముగ్గురు మృతి

ఒకరికి స్వల్పగాయాలు

కొవ్వూరు రోడ్డు కం రైలు బ్రిడ్జిపై ఘటన

కొవ్వూరు, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): సినిమా చూసొద్దామని సరదాగా బయలుదేరారు ముగ్గురు యువకులు. కానీ దారిలోనే మృత్యువు మింగేసింది. సినిమాకు వెళ్లిన వారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబసభ్యులకు కన్నీరే మిగిలి ంది. ఈ విషాద సంఘటన తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు రోడ్డు కం రైలు బ్రిడ్జిపై జరిగింది. బ్రిడ్జిపై ఎదురెదురుగా రెండు మోటారుసైకిళ్లు ఢీకొన్న సంఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు.

అసలేం జరిగిందంటే...?

కొవ్వూరు పట్టణంలోని శ్రీనివాసపురానికి చెందిన పోతుగుంట అక్షయ్‌కుమార్‌ (20), కొమిరి ఏడుకొండలు (18), గాజుల వారి వీధికి చెందిన తగరపు సత్యకళ్యాణ్‌ అలియాస్‌ సునీల్‌ (20) ముగ్గురు కలిసి సోమవారం రాత్రి సినిమా చూద్దామని పల్సర్‌ బైక్‌పై రాజమహేంద్రవరం బయలుదేరారు. రాజమహేంద్రవరం క్వారీ మార్కెట్‌ ప్రాంతానికి చెందిన ఆనాపు లక్ష్మీనారాయణ (34) యాక్టివాపై కొవ్వూరు వస్తుండగా రోడ్డు కం రైలు బ్రిడ్జి 104వ స్తంభం రెం డు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్ర మాదంలో అక్షయ్‌కుమార్‌, సునీల్‌, లక్ష్మీనారాయణ తలలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఏడుకొండలుకు స్వల్పగాయాలు కావడంతో 108 వాహనంలో కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అత్యవసర వైద్యం నిమిత్తం రాజమహేంద్రవరం తరలించారు. సమాచారం తెలిసిన వెంటనే పట్టణ సీఐ పి.విశ్వం సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదం తో బ్రిడ్జిపై నిలిచిన ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

ఒక్కొక్కరిది ఒక్కో కథ...

లపోతుగుంట అక్షయ్‌కుమార్‌ హైదరాబాద్‌లో సినీ పరిశ్రమలో పని చేస్తుంటాడు. ఇటీవల శస్త్ర చికిత్స జరిగింది. దాని నిమిత్తం ఆసుపత్రిలో చూపించుకోవడానికి ఈనెల 1న ఇంటికి వచ్చాడు. తండ్రి శివకుమార్‌ కొవ్వూ రు టోలిగేట్‌ సెంటర్‌లో హోటల్‌ నడుపుతుంటాడు. తల్లి, అన్నయ్య ఉన్నారు. అక్షయకుమార్‌ సోమవారం ఆసుపత్రికి వెళ్లవలసి ఉండగా తల్లితో రేపు వెళ్లదామని చెప్పాడు. రాత్రి 6-30 గంటల సమయంలో స్నేహితులతో రాజమహేంద్రవరం సినిమాకి వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వ చ్చాడు. ఇంతలో ప్రమాదం జరిగింది. అతడి మరణవార్త సమాచారం తెలియడంతో శ్రీని వాసపురంలో విషాదచాయలు అలముకున్నాయి. ఇందుకోసమా హైదరాబాదు నుంచి ఇంటికి వచ్చింది అని కుటుంబసభ్యులు రోధి ంచడం చూపరులను కంటతడి పెట్టించింది. తగరపు సత్యకళ్యాణ్‌ అలియాస్‌ సునీల్‌ పట్టణంలోని గాజులవారి వీధిలో నివాసం ఉంటు న్నాడు. వాటర్‌ ప్యూరీఫైర్‌ షాపులో చేస్తుంటాడు. తండ్రి పోశయ్య షామియానా కంపెనీలో పనిచేస్తుంటాడు. సునీల్‌కు తల్లి రత్నం, అక్క లలిత ఉన్నారు. రాజమహేంద్రవరం క్వారీమార్కెట్‌ సెంటర్‌కు చెందిన ఆనాపు లక్ష్మీనారాయణ రాజమహేంద్రవరం వీరవల్లి లా కాలేజ్‌లో ఎల్‌ఎల్‌బీ చదువుతున్నాడు. టీవీ షోలలో ఆర్టిస్ట్‌గా చేస్తుంటాడు. అతడి తండ్రి ఆనాపు సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు కొవ్వూరు సీఐ పి.విశ్వం తెలిపారు. కొమిరి ఏడుకొండలు తండ్రి బాలయ్య చిన్నతనంలో చనిపోయాడు. తల్లి మట్టి పని చేసుకుంటూ ఇద్దరు కుమారులను పెంచింది. రోడ్డు ప్రమాదంలో తన కొడుకుని ఆ దేవుడే కాపాడడని కుటుంబసభ్యులు ప్రార్థనలు చేస్తున్నారు.

హెల్మెట్‌ ఉంటే బ్రతికేవారేమో..

రాష్ట్ర ప్రభుత్వం రహదారి భద్రతా మాసోత్సవాల పేరుతో కొన్నిరోజులుగా సదస్సులు పెట్టి హెల్మెట్‌ వాడకంపై అవగాహన కల్పిస్తుంది. అ యినా వాహనదారులు, యువత భద్రతపై పెడచెవిన పెడుతూ వస్తున్నారు. వాహనంతో పాటు హెల్మెట్‌ అందించినప్పటికి వాటిని షో కేసులలో భద్రపరుస్తున్నారు. సోమవారం కొవ్వూరు రోడ్డు కం రైలు వంతెనపై రెండు ద్విచక్ర వాహనాలు ఎ దురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాలపై ఉన్న ముగ్గురు వ్యక్తులు బండిపై నుంచి కింద పడడంతో తలలు రోడ్డుకు తగిలి తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయా రు. అదే హెల్మెట్‌ ధరించి ఉంటే ముగ్గురిలో ఇద్దరి ప్రాణాలైన నిలిచి ఉండేవి. ఇకనైనా ప్రధానంగా యువత, వాహనదారులు హెల్మెట్‌ ధరించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Updated Date - Feb 03 , 2026 | 01:00 AM