Share News

దొడ్డి దారిలో దొరల్లా...

ABN , Publish Date - Feb 04 , 2026 | 12:16 AM

గంజాయి నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం ఎన్ని కసరత్తులు చేస్తున్నా కొందరు దొడ్డి దారిన తరలిస్తున్నారు. నిఘా కళ్లు కప్పి, రూట్‌ మార్చి సరిహ ద్దులు దాటిస్తున్నారు. వారిలో కొందరు స్మగ్లర్లు తెలంగాణ పోలీసుల చేతికి చిక్కుతున్నారు పొరు గు రాష్ట్రమైన తెలంగాణలోని ఒక్క భద్రాచలంలోనే గడచిన ఏడాదిలో అక్కడి పోలీసులు రూ. 30 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన అఽధికారిక గణాంకాలే ఇందు కు నిదర్శనం. పట్టుబడిన

దొడ్డి దారిలో దొరల్లా...
ఒడిసాలో గంజాయి పంట సాగు (ఫైల్‌)

తరలిపోతున్న గంజాయి

నిఘా కళ్లు కప్పి రూటు మార్చి సరిహద్దులు దాటిస్తున్న స్మగ్లర్లు

అటవీ, జల మార్గాల్లో తరలింపు

మత్తులో చెడుమార్గం వైపు పయనిస్తున్న యువకులు

(చింతూరు - ఆంధ్రజ్యోతి)

గంజాయి నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం ఎన్ని కసరత్తులు చేస్తున్నా కొందరు దొడ్డి దారిన తరలిస్తున్నారు. నిఘా కళ్లు కప్పి, రూట్‌ మార్చి సరిహ ద్దులు దాటిస్తున్నారు. వారిలో కొందరు స్మగ్లర్లు తెలంగాణ పోలీసుల చేతికి చిక్కుతున్నారు పొరు గు రాష్ట్రమైన తెలంగాణలోని ఒక్క భద్రాచలంలోనే గడచిన ఏడాదిలో అక్కడి పోలీసులు రూ. 30 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన అఽధికారిక గణాంకాలే ఇందు కు నిదర్శనం. పట్టుబడిన గంజాయి మొత్తం ఒడిసా రాష్ట్రంలో కొనుగోలు చేసిందేనని అక్కడి పోలీసుల విచారణలో స్పష్టమైంది. ఇక పట్టుబడిన పలువురు స్మగ్లర్లు జైళ్ల పాల య్యారు. వారిలో చింతూరు మండలంకు చెందిన నిందితులు కూడా ఉండడం గమనార్హం. ఒడిసా రాష్ట్రం మల్కనగిరి జిల్లా అటవీ ప్రాంతంలో గంజాయి సాగు చేస్తు న్న విషయం బహిరంగ రహస్యమే. అక్కడ నుం చి మోతుగూడెం, చింతూరు మీదుగా గంజాయి తరలించడం కూడా తెలిసిందే. ఈ క్రమంలో చింతూరు సర్కిల్‌ పోలీసులు చేతికి చిక్కిన స్మగ్ల ర్లపై నమోదైన కేసులు కూడా ఉన్నాయి. కాగా ఇటీవల స్మగ్లర్లు కూడా పటిష్ట మైన నిఘా వ్యవస్థ, రూట్‌ క్లియరెన్సు బృందాలను ఏర్పాటు చే సుకుంటున్న విషయం పలు సందర్భాల్లో వెల్ల డైంది. ఆయా బృందాలు ఇచ్చిన రూట్‌ క్లియరెన్సు సమాచారం అనుసరిస్తూ స్మగ్లర్లు గంజాయి తరలింపునకు దారులు ఎంపిక చేసుకుంటున్నారు. ఇందుకు కా ర్లు, ద్విచక్రవాహనాలు, ఆటో లు, వ్యాన్లను స్మగ్లర్లు వినియోగిస్తున్నారు. ఇప్పటివరకు ఒడిస్సా నుంచి డొంకరాయి పరిధి గ్రామాలకు ముందుగా గంజాయి చేర్చి అక్కడ నుంచి వయా మోతుగూడెం, చింతూరు, మారేడుమిల్లి మీదుగా గంజాయి తరలివెళ్లేది. కాగా నిఘా పెరగడంతో గంజాయి తరలింపునకు అటవీ, జల మార్గాలను ఎంచుకుంటున్నారు.

వంతెనను వదలలేదు...

ఇటీవల ఛత్తీస్‌గడ్‌, ఒడిస్సాల నడుమ శబరి నదిపై వంతెన నిర్మించడంతో గంజాయి తరలింపునకు స్మగ్లర్లలో ఎక్కువమంది ఈ దారిని విని యోగించుకుంటున్నారు. ఒడిస్సాలోని మల్క నగిరి జిల్లాలో కొనుగోలు చేసిన గంజాయిని వయా మోటు మీదుగా ఛత్తీస్‌గడ్‌లోని కుంటకు తదుపరి చింతూరు, కూనవరం, ఎటపాక మండలాల మీదుగా తెలంగాణకు... అక్కడి నుంచి వ హారాష్ట్ర, తమిళనాడు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. చింతూరు మండలంలోని పాలగూడెం, ఎటపాక మండలంలోని బండిరేవు, విస్సాపురం, నల్లకుంట, కూనవరం మండలంలోని పోలిపాక తదితర గ్రామాల పరిసర అటవీదారులు మీదుగా తెలంగాణకు తరలిస్తున్నారు.

యువతకు ఆశ చూపి...

మరి కొందరు చింతూరు మండలం చట్టి మీదుగా కూనవరం మండలంలోని పోలిపాక వద్దకు చేర్చి అక్కడ గోదావరి దాటించి ఏలూరు జిల్లా ఇంజ రానికి అక్కడ నుంచి వారి గమ్య స్థానానికి చేర్చుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల స్మగ్లర్లు గంజాయిని గోదావరి దాటించే ప్రయత్నంలో కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి పట్టిం చిన ఘటన కూడా ఉంది. అదే దశలో ఏలూరు జిల్లా కుకునూరు మండల పోలీసుల చేతికి స్మగ్లర్లు దొరకడం కేసులు నమోదు చేయడం కూడా జరిగింది. ఈ తరలింపు కోసం స్మగ్లర్లు కొందరు యువతకు ధనాశ చూపి వినియోగించుకున్నట్టు సమాచారం. ఈ వైపుగా తరలి వెళ్లిన గంజాయి సేవిస్తున్న యువత ద్విచక్రవాహనాలను అతి వేగంగా నడపడం ఆపై ప్రమాదాలకు గురవు తున్న ఘటనలు కూడా లేకపోలేదు. సిగరెట్లలో గంజాయి నిం పుకుని తాగుతూ కొందరు యువ కులు చెడుమార్గం వైపు పయనిస్తున్నట్టు ప్రచారం ఉంది. భద్రాచలంలో ఇటీవల గంజాయి మత్తులో చోటుచేసుకుంటున్న నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇంత జరుగుతు ంటే అధికారులు తీసుకునే చర్యలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయనే విమర్శలు వినిపిస్తు న్నాయి. మరింత నిఘా పెంచుతారో లేదో చూడాల్సి ఉంది.

Updated Date - Feb 04 , 2026 | 12:16 AM