గోదావరి పుష్కరాలకు సిద్ధం!
ABN , Publish Date - Feb 07 , 2026 | 12:50 AM
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 6 (ఆంధ్ర జ్యోతి): 2027 జూన్ 26 నుంచి జులై 7వరకూ జరిగే గోదావరి పుష్కరాలకు అందరూ సిద్ధం కా వాలి, ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వ ర్యంలో ఉన్నత స్థాయి మీటింగ్ జరిగింది. దానికి కొనసాగింపుగా సమీక్ష చేశాం. నియోజ కవర్గాల వారీగా ప్రజాప్రతినిధుల
మంత్రి కందుల దుర్గేష్
కలెక్టర్, ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష
పలు సూచనలు చేసిన ప్రజాప్రతినిధులు
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 6 (ఆంధ్ర జ్యోతి): 2027 జూన్ 26 నుంచి జులై 7వరకూ జరిగే గోదావరి పుష్కరాలకు అందరూ సిద్ధం కా వాలి, ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వ ర్యంలో ఉన్నత స్థాయి మీటింగ్ జరిగింది. దానికి కొనసాగింపుగా సమీక్ష చేశాం. నియోజ కవర్గాల వారీగా ప్రజాప్రతినిధుల నుంచి ప్రతిపా దనలు స్వీకరించి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సిని మాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అధి కారులను ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కలెక్టరేట్‌లో శుక్రవారం జి ల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యేలు గోరంట్ల బు చ్చయ్యచౌదరి, బత్తుల బలరామకృష్ణ, నల్లమల్లి రామకృష్ణారెడ్డి, వేగుళ్ల జోగేశ్వరరావు, జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు, ఇతర అధికారులతో కలసి మంత్రి స మీక్షించారు. పుష్కరాల నిర్వహణలో పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ దేవాదాయ, పర్యాటక, ఇరి గేషన్ విద్యుత్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాల న్నారు. త్వరలోనే రాష్ట్రస్థాయి అధికారులు, హెచ్ వోడీలతో కలసి పూర్తిస్థాయి కార్యాచరణ ప్రణా ళిక సిద్ధం చేస్తామన్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక టెంపులు సర్క్యూట్లను అంటే నవజనా ర్ధన పారిజాతం ( వైష్ణవ) ఆలయాలు, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలను అనుసంధానం చేస్తూ ప ర్యాటక ప్యాకేజీలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. పాపికొండల బోటు షికారును కూడా పుష్కరాల్లో భాగం చేయనున్నామని మంత్రి తెలిపారు.
స్పష్టమైన లక్ష్యాలతో బడ్జెట్...
కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి స్పష్టమైన లక్ష్యాలతో బడ్జెట్‌కు అనుకూలంగా ఉండాలన్నారు. వాటి వివరాలు హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్‌కు పంపి కేటాయింపులు జరిగేలా సమన్వయంతో పనిచే యాలని సూచించారు. పుష్కరఘాట్ల వద్ద అండర్ గ్రౌండ్ కేబులు వర్కు ప్రతిపాదనలు సి ద్ధం చేయాలన్నారు. ఎమెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం నుంచి ఏఏ శాఖల ద్వారా నిధులు పొందే అవకాశం ఉందో గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. రా జమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ఇంకా పుష్కరాలకు 15 నెలల సమయం మాత్రమే ఉందని, ఆలయాల అభివృద్ధి, రహదారి విస్తరణ, ఔటర్ రింగ్‌రోడ్డు పనులు వేగవంతం చేయాలన్నారు. అభివృద్ధి చేసే దేవాలయాలపై నివేదిక ఇవ్వాలన్నారు. అన పర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడు తూ స్నాన ఘట్టాల సమీపంలో దాతల ఇచ్చిన స్థలాల్లోనూ ప్రదాన కార్యక్రమాల కోసం షెడ్ల ని ర్మాణం చేపట్టాలని సూచించారు. టెంపుల్ టూ రిజం, ఇరిగేషన్, రహదారుల అభివృద్ధి పనులు వెంటనే చేపట్టాలన్నారు. మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ తమ నియో జకవర్గంలో ఏడు గ్రామ పంచాయతీల పరిధిలో నుంచి గోదావరి నది ప్రవహిస్తుందని, అన్ని ఘాట్లకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రా జానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మా ట్లాడుతూ జాతీయ రహదారి మార్గాలకు అనుస ంధానంగా ఉన్న అంతర్గత రహదారులపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. రాష్ట్ర స్కిల్ డెవ లప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ దీర్ఘకాలిక అవస రాలను దృష్టిలో పెట్టు కుని రహదారులు అభి వృద్ధి చేయాలన్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ దేవదాయ, ఇరిగేషన్, రహదారుల అభివృద్ధి కోసం ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం ఏ ర్పాటు చేయాల న్నారు. సమావేశంలో ఎస్పీ డి.నరసింహ కిశో ర్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, ఆర్డీ వోలు కె.భాస్కరరెడ్డి,రాణి సుస్మిత పాల్గొన్నారు.
టెంట్ సిటీల ఏర్పాటు..
పుష్కరాలకు కోట్లాది మంది భక్తులు వస్తారని అందుకనుగుణంగా కుంభ మేళా తరహాలో అత్యున్నత ప్రమాణా లతో టెంట్‌సిటీలు ఏర్పాటు చే యను న్నట్టు మంత్రి దుర్గేష్ చెప్పారు. హోంస్టే పాలసీ ప్రోత్సహించనున్నామని, ఉభయ గోదావరి జి ల్లాలోని మండువా లోగిళ్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు చెప్పారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఏఘాట్‌లో స్నానం చేసినా పుణ్య ఫలం సమానమనే విషయాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలన్నారు. ప్రముఖ ప్రవచన కర్తలు గరికి పాటి నరసింహారావు, చాగంటి కోటేశ్వరరావు ద్వా రా విస్తృత ప్రచారం చేయనున్నట్టు తెలిపారు. కేంద్రప్రభుత్వ సాస్కి స్కీమ్ ద్వారా రూ.97 కోట్లతో చేపట్టిన అఖండ గోదావరి ప్రాజెక్టులను పుష్కరాల నా టికి పూర్తి చేస్తామన్నారు. పుష్కర ఘాట్ అభివృద్ధి, హేవలాక్ బ్రిడ్జి, బ్రిడ్జిలంక వాట ర్ స్పోర్స్ట్, కడియం ఎక్స్‌పీరియన్స్ సెంటర్, నిడ దవోలు కోట సత్తెమ్మ ఆలయాభివృద్ధి, శెట్టిపేట బోట్ షికారు పనులు వేగవంతం చేయాలని అ ధికారులను ఆదేశించారు. రోడ్ల కనెక్టివిటీ కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో రూ.1000కోట్లతో ప్ర తిపాదనలు చేయనున్నట్టు చెప్పారు. శాంతి భద్ర తలు, పార్కింగ్ స్థలాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్‌కు సూ చించారు.