‘పాదగయ’ ఆదాయం రూ.15.78 లక్షలు
ABN , Publish Date - Feb 04 , 2026 | 12:15 AM
పిఠాపురం, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రంలోని హుండీలను మంగళవారం తెరిచారు. పాదగయలోని కుక్కుటేశ్వరస్వామి, దత్తాత్రేయస్వామి, రాజరాజ్వేరీదేవి, పురూహూతికా అమ్మవార్ల సన్నిధిలో, ఆలయ ప్రాంగణంలో గల అన్నదాన హుండీలను లెక్కించగా 55
పిఠాపురం, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రంలోని హుండీలను మంగళవారం తెరిచారు. పాదగయలోని కుక్కుటేశ్వరస్వామి, దత్తాత్రేయస్వామి, రాజరాజ్వేరీదేవి, పురూహూతికా అమ్మవార్ల సన్నిధిలో, ఆలయ ప్రాంగణంలో గల అన్నదాన హుండీలను లెక్కించగా 55 రోజులకు గానూ రూ.15,78, 892 ఆదాయం లభించింది. లెక్కింపులో జిల్లా దేవదాయశాఖాధికారి కనపర్తి నాగేశ్వరరావు, ఇనస్పెక్టర్ వడ్డి ఫణీంద్రకుమార్, పాదగయ ఈవో కాట్నం జగన్మోహన శ్రీనివాస్, ఈవోలు అశ్విని, ధనలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం లోని కుంతీమాధవస్వామి దేవస్థానంలోని హుండీలను లెక్కించారు. ఏడాది కాలానికి రూ.2,89,195 ఆ దాయం లభించింది. దేవదాయశాఖ తనిఖీదారు వడ్డి ఫణీంద్రకుమార్, ఈవో బి.ధనలక్ష్మీ, కుంతీమాధవ భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు.