ఆంధ్రప్రదేశ్లో తీవ్ర వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో తూర్పు గోదావరి జిల్లాలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బస్సులు, రైళ్లు, విమాన సర్వీసులు ఆలస్యమవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పాదగయలో విషాద ఘటన చోటుచేసుకుంది. పుష్కరిణిలో స్నానానికి దిగిన ఓ యువకుడు గల్లంతయ్యాడు.
కాకినాడ సాంబమూర్తినగర్ ఇందిరాకాలనీలో ఈ నెల 2న జరిగిన గండి గిరిధర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాధితుడి స్నేహితులే అతన్ని హత్య చేసినట్లు గుర్తించి అరెస్టు చేశారు.
విశాఖపట్నం - విజయవాడ రైలు మార్గంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు - పశివేదల మధ్య శుక్రవారం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధారపల్లి సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో పులి సంచారంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. పులి కదలికలు, ప్రస్తుత పరిస్థితి, అటవీ శాఖ చేపడుతున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన భార్యకు సంబంధించిన విచారణను రోజువారీగా నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో బుధవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. పండువారిపేటలో నిర్వహించే ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. అలాగే రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు.
కాకినాడ జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. సీనియర్ నేతలు వరుసగా ఆ పార్టీని వీడుతున్నారు. పెద్దాపురం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, జగ్గంపేట నియోజకవర్గం పరిశీలకుడు నెక్కంటి సాయి ప్రసాద్.. ఆ పార్టీకి రాజీనామా చేశారు.
పిఠాపురం నియోజక వర్గంలోని ఉప్పాడ తీర ప్రాంతవాసుల దశాబ్దాల కల సాకారం దిశగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవతో తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం దిశగా కీలక అడుగులు ప్రారంభమయ్యాయి.
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రావులపాలెం శివారు కొత్త కాలనీలో భార్యాభర్తలు కర్రి దుర్గాలక్ష్మి, భర్త కర్రి నాగేశ్వరరెడ్డి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.