పోచవరం బోట్ పాయింట్ దగ్గర మొసలి కలకలం
ABN , Publish Date - Feb 08 , 2026 | 12:40 AM
వీఆర్‌పురం, ఫిబ్రవరి 7(ఆంధ్ర జ్యోతి): పోచవరం విహారయాత్ర బోట్ పాయింట్ దగ్గర మొసలి కల కలం రేపింది. శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో బోట్ పా
భయాందోళన చెందిన బోట్ కార్మికులు, స్థానికులు
వీఆర్‌పురం, ఫిబ్రవరి 7(ఆంధ్ర జ్యోతి): పోచవరం విహారయాత్ర బోట్ పాయింట్ దగ్గర మొసలి కల కలం రేపింది. శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో బోట్ పాయి ంట్ దగ్గర గోదావరి నది నుంచి బయటకు రావడంతో ఆ సమయం లో అక్కడున్న బోట్ కార్మికులు, స్థానికులు భయాందోళన చెందారు. వెంటనే స్థానికులు దానిని చాకచ క్యంగా తాళ్లతో కట్టి అధికారులకు సమాచారం ఇచ్చారు. తర్వాత మొసలిని గోదావరి నదిలోకి వదిలేశారు. దీంతో గోదావరిలోకి పర్యాటకులు, స్థానికులు దిగ వ ద్దని అధికారులు ఆదేశాలి చ్చా రు. బోటు యజమానులు కూడా పర్యాటకు ల ను గోదావరిలోకి దిగవద్దని సూచించాలన్నారు.