హైవేపై ఢీకొన్న కారు... 12 పల్టీలు కొట్టిన థార్ జీపు
ABN , Publish Date - Feb 10 , 2026 | 12:59 AM
గొల్లప్రోలు రూరల్, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడి జం క్షన్ వద్ద గల జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఆరు గురికి తీవ్ర గాయాలయ్యాయి. జీపు చక్రాలు ఊడిపడ్డాయి. కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రా మానికి చెందిన పాటంశెట్టి మణినాగేంద్ర ప్రైవేటు ఫొటోగ్రాఫర్‌గా ప
ప్రమాద తాకిడికి ఊడిపడిన చక్రాలు
ఆరుగురికి తీవ్ర గాయాలు
గొల్లప్రోలు మండలం వన్నెపూడి జంక్షన్ వద్ద ఘటన
గొల్లప్రోలు రూరల్, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడి జం క్షన్ వద్ద గల జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఆరు గురికి తీవ్ర గాయాలయ్యాయి. జీపు చక్రాలు ఊడిపడ్డాయి. కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రా మానికి చెందిన పాటంశెట్టి మణినాగేంద్ర ప్రైవేటు ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. విశాఖ నగరంలో జరిగిన వెడ్డింగ్ షూట్ నిమిత్తం కేశనకుర్తి శ్రీను, అజేష్, వీరశివ, చినవీర్రాజుతో కలిసి థార్ జీపులో ఆదివారం వెళ్లారు. అక్కడ వె డ్డింగ్ షూట్ పూర్తి చేసుకుని సోమవారం విశాఖ నుంచి తిరిగి పయనయ్యారు. కత్తిపూడి దాటి వ న్నెపూడి జంక్షన్ సమీపంలోకి వచ్చేసరికి ముం దుగా వెళ్తున్న కారు డ్రైవర్ ఇష్టారాజ్యంగా నడుపుతూ ఫీట్లు చేశాడు. కా రును సడన్‌గా వెనక్కి తిప్పి థార్ జీపును ఢీకొన్నాడు. దీంతో 12 పల్టీలు కొట్టింది. ఈ తాకిడికి చక్రాలు ఊడిపడి పోయాయి. జీపులోని ఐదుగురు వ్యక్తులతో పాటు కారులో ఉన్న వ్యక్తికి గాయాలయ్యా యి. వారిని అంబులెన్స్‌లో ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి త రలించగా అక్కడ నుంచి కాకినాడలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. గొల్లప్రోలు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.