విద్యార్థులకు తాజా ఆహారం అందించాలి
ABN , Publish Date - Feb 10 , 2026 | 12:55 AM
మారేడుమిల్లి, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు తాజాగా వండిన ఆహారాన్ని అందిం చాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఇన్‌చార్జి డైరెక్టర్ వి.ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదే శిం చారు. సోమవారం పోలవరం జిల్లా మారేడు మిల్లి మండలం దేవరపల్లి గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమ పాఠశాలను పోలవరం
రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఇన్‌చార్జి డైరెక్టర్ ప్రసన్న వెంకటేష్
దేవరపల్లి ఆశ్రమ పాఠశాల సందర్శన
మారేడుమిల్లి, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు తాజాగా వండిన ఆహారాన్ని అందిం చాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఇన్‌చార్జి డైరెక్టర్ వి.ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదే శిం చారు. సోమవారం పోలవరం జిల్లా మారేడు మిల్లి మండలం దేవరపల్లి గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమ పాఠశాలను పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ బి.స్మరణ్ రాజ్‌తో కలిసి సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశా రు. వసతి గృహంలోని పరిస్థితులను పరిశీలించారు. వసతిగృహం, కిచెన్, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, రన్నీంగ్ వాటర్ సరఫరా తదితర అం శాలను ఆయన పరిశీలించారు. వెండర్లు సరఫరా చేస్తున్న కూరగాయలు, పాలు, గుడ్లు, నిత్యావసర వస్తువులు నాణ్యతను ప్రతీ ఆశ్రమ పాఠశాలలో ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని హెచ్చరించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందించాలని, మెనూ బోర్డులో విద్యార్థులకు అర్ధమేయ్యేలా రోజూ రాయాలని తెలిపారు. గ్రామస్తులు మరుగుదొడ్లు మరమ్మతులు, రన్నింగ్ వాటర్ ఏర్పాటు, ప్రహారీ గోడ ఏర్పాటు తదితర అంశాలను ఆయన దృష్టికి తీసురాగా వీటిపై తక్షణం చర్యలు చేపట్టాలని అధి కారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరక్టర్ రుక్మాండ య్య, డీఎంహెచ్‌వో పి.సరిత, మాజీ ఎమ్మె ల్యే నాగుపల్లి ధనలక్ష్మి, ఎంపీపీ సార్ల లలితా కుమారి, వైస్ ఎం పీపీ లక్కొండ రవికుమార్, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ సూర్యప్రకాశ్‌రావు ఉన్నారు.