బెంగళూరు టు రాజమహేంద్రవరం..
ABN , Publish Date - Feb 10 , 2026 | 12:57 AM
కొవ్వూరు, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): మత్తు పదార్థం రవాణా చేస్తున్న నలుగురు యువకులను అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్టు కొవ్వూ రు డీఎస్పీ జి.దేవకుమార్ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు డీఎస్పీ కార్యాలయంలో సోమవారం విలేకర్ల సమావేశంలో డీఎస్పీ దేవకుమార్ మాట్లా
మెత్ మత్తు పదార్థం రవాణా చేస్తున్న నలుగురి అరెస్టు
కారు, 18.15 గ్రాముల మెత్, 3 సెల్‌ఫోన్లు, ఐప్యాడ్,
రూ.600 నగదు, 6 విదేశీ కరెన్సీ నోట్లు స్వాధీనం : కొవ్వూరు డీఎస్పీ
కొవ్వూరు, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): మత్తు పదార్థం రవాణా చేస్తున్న నలుగురు యువకులను అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్టు కొవ్వూ రు డీఎస్పీ జి.దేవకుమార్ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు డీఎస్పీ కార్యాలయంలో సోమవారం విలేకర్ల సమావేశంలో డీఎస్పీ దేవకుమార్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం రూ రల్ మండలం కొలమూరు గ్రామంలోని ఎలైట్ సమీపంలో నివాసం ఉంటున్న కాటూరి సూర్యకిషన్, విశాఖపట్నంలోని నాయుడు తోట పెట్రోల్‌బంకు సమీపంలో నివాసం ఉంటున్న ము మ్మిడి విజయలక్ష్మి, కోరుకొండ ఆర్టీసీ కాంప్లెక్ ఎదురుగా అంబేడ్కర్ వీధికి చెందిన నొక్కు మహదీప్, రాజవోలు గ్రామం గాయిత్రినగర్ 2వ గేట్, వివేక్ స్కూల్ ఎదురుగా ఉంటున్న ఇసుకపట్ల వివేక్‌వర్ధన్ కలిసి టీఎస్ 08 ఎఫ్‌వై 5598 నంబరుగల అమెజ్‌కారును సెల్ఫ్ డ్రైవింగ్‌కు అద్దెకు తీసుకుని బెంగళూరు మెత్ (మెతమ్‌పేతమైన్) అనే మత్తు పదార్థాన్ని రాజమహేంద్రవరం తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం మధ్యాహ్నం కొవ్వూరు గా మన్ బ్రిడ్జి టోల్‌ప్లాజా సమీపంలో కొవ్వూరునుంచి దొమ్మేరు వెళ్లే రోడ్డులో అండర్‌పాస్ వద్ద సీఐ పి.విశ్వం, ఎస్‌ఐ ఎ.వంశీ అలెంగ్జాండర్ వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఈ నలుగురిని అరెస్టు చేసి వారి నుంచి అమెజ్‌కారు, రూ.54,450 విలువైన 18.15 గ్రాముల మెత్, 3 సెల్‌ఫోన్లు, ఐప్యాడ్, రూ.600 నగదు, 6 విదేశీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నలుగురు మత్తు పదార్థానికి అలవాటుపడి దానిని తీసుకోవడంతో పాటు, బెంగళూరు నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చి రాజమహేంద్రవరం, తణుకు పరిసర ప్రాంతాల్లో కాలే జ్ విద్యార్థులకు అమ్ముతున్నట్టు డీఎస్పీ తెలిపా రు. వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించామన్నారు.సమావేశంలో సీఐ, ఎస్‌ఐ ఉన్నారు.