కలుషిత ఆహారం తిని 89 మంది విద్యార్థులకు అస్వస్థత
ABN , Publish Date - Feb 08 , 2026 | 12:41 AM
మారేడుమిల్లి, పిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): పోలవరం జిల్లా మారేడుమిల్లి మండలం దేవరపల్లి గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాలలో కలుషిత ఆహారం తిని 89 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం విద్యార్థులు ఇడ్లీ, శెనగపిండి చెట్నీని అల్పాహారంగా తీసుకున్నారు. కొద్దిసేపటికి
గిరిజన పాఠశాలలో ఘటన
రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో వైద్యసేవలు
మారేడుమిల్లి, పిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): పోలవరం జిల్లా మారేడుమిల్లి మండలం దేవరపల్లి గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాలలో కలుషిత ఆహారం తిని 89 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం విద్యార్థులు ఇడ్లీ, శెనగపిండి చెట్నీని అల్పాహారంగా తీసుకున్నారు. కొద్దిసేపటికి 18 మంది విద్యార్థులకు కడుపునొప్పి, విరేచనాలు, వాంతులు అవ్వడంతో పాఠశాల సిబ్బంది విద్యార్థులను మారేడుమిల్లి పీహెచ్‌సీకి తరలించి వైద్యసేవలు అందించారు. మధ్యాహ్న భోజనంలో పప్పుక్యాబేజీ, సాంబారుతో భోజనం అనంతరం విద్యార్థులు జ్వరం, విరేచనాలు, వాంతులకు గుర వ్వడంతో వెంటనే 71 మంది విద్యార్థులను అం బులెన్స్, 108, ప్రైవేట్ వాహనాల్లో రంపచోడ వరం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అం దిస్తున్నారు. పాఠశాలలో మొత్తం 277 మంది విద్యార్థులు ఉండగా అస్వస్థతకు గురైన వారికి ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా మి గతా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా పాఠ శాల వసతిగృహంలో అధికారులు మెడికల్ క్యాం పును ఏర్పాటు చేసి వైద్యసేవలు అందిస్తున్నారు.