పొగాకు రైతులకు..భారీ ఊరట
ABN , Publish Date - Feb 08 , 2026 | 12:39 AM
పొగాకు రైతులకు భారీ ఊరట లభించింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వర్జీనియా పొగాకు పండి స్తున్నారు. తరాల నుంచీ ఈ సాగులో ఉన్న రైతులు
రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి చొరవ
బ్రాండ్‌లేని పొగాకుపై 18ు సుంకం పూర్తిగా రద్దు
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రైతులకు
రూ.35 లక్షల వరకూ చేకూరనున్న మేలు
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
పొగాకు రైతులకు భారీ ఊరట లభించింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వర్జీనియా పొగాకు పండి స్తున్నారు. తరాల నుంచీ ఈ సాగులో ఉన్న రైతులు చాలామంది ఉన్నారు. అయితే నెల క్రితం కేంద్ర ప్రభుత్వం బ్రాండ్‌లేని, ప్యాక్ చేయ ని పొగాకుపై 18ు ఎక్సయిజ్ పన్ను విధించింది. ఇప్పటికే పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోవ డానికి తోడు ఇప్పుడు ఈ సుంకం వల్ల మరింత నష్టపోతామని రైతులు ఆందోళన చెందారు. అయితే రాజమహేం ద్రవరం ఎంపీ పురందేశ్వరి చొరవతో ఆ పన్ను రద్ద యింది. దీంతో ఉమ్మడి తూర్పు గోదావరి పొగాకు రైతులకు రూ.35లక్షల వరకూ మేలు చేకూరనుంది.
5వేల ఎకరాల్లో..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎన్‌ఎ ల్‌ఎస్(నార్త్ లైట్ సాయిల్), ఎన్‌బీఎస్ (నార్త్ బ్లాక్ సాయిల్) అనే రెండు రకాల వర్జీనియా పొగాకును పండిస్తున్నారు. ఎక్కువగా గోదావరి లంకలు, తొర్రే డు, రాజానగరం, కోరుకొండ, గండేపల్లి, రంగంపేట, దేవరపల్లి, గోపాలపురం ప్రాంతాల్లో 1200 మంది రైతులు సుమారు 5వేల ఎకరాల్లో పొగాకును సాగు చేస్తుండగా.. ఆకును పక్వానికి తీసుకురావడానికి 1500 వరకూ బ్యారెన్లు ఉన్నాయి. మొత్తం అమ్మకం జరిగే వరకూ పెట్టుబడి ఎకరాలకు రూ.3.50లక్షలు ఖర్చవుతుం ది. మార్చి నెల నుంచీ ఆగస్టు వరకూ పొగాకు బోర్డు ద్వారా అమ్మకాలను నిర్వహిస్తారు. రోజుకు ఒక మొక్క నుంచి రెండు మూడు ఆకులు కోస్తూ వాటిని బ్యారెన్లలో పెట్టి పక్వానికి తెస్తారు. రైతులు, కొనుగోలుదారులకు మధ్యవర్తిగా పొగాకు బోర్డు వ్యవహరిస్తూ రైతులకు నష్టం రాకుండా చూస్తుంది. కొత్త వంగడాలను ఇవ్వడం, సాగులో మెళకువలు, చీడపీడల నుంచి రక్షించుకోవడం వంటి వాటిలో రాజ మ ండ్రిలోని నేషనల్ ఇనిస్టి ట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ కమర్షియల్ అగ్రి కల్చర్ (గతంలో సీటీఆర్‌ఐ) సహాయం చేస్తోంది.
ఢిల్లీకి నాయకులు..
బ్రాండ్‌లేని, ప్యాక్ చేయని ముడి పొగాకుపై 18 శాతం సుంకాన్ని విధిస్తూ కేంద్ర ప్రభుత్వం రెండు నెలల క్రితం నోటిఫికేషన్ ఇచ్చింది. అంటే నూటికి రూ.18 చొప్పున సెంట్రల్ ఎక్సయిజ్ డ్యూటీ చెల్లిం చాలి. 2024-25లో కిలోకు రూ.340 ధర లభించింది. అయితే సుంకాన్ని కొనుగోలుదారుడు భరించే పరి స్థితి ఉండదని, రైతులకు ఇచ్చే ధరలో తగ్గిస్తారని పొగాకు రైతుల్లో ఆందోళన బయలు దేరింది. అంటే రైతులకు లభించే సొమ్ములో కిలోకు రూ.60-65 వరకూ నష్టపోతారు. ఎకరాకు వెయ్యి నుంచి 1200 కిలోల వరకూ పొగాకు వస్తుంది. ఈ లెక్కన ఉ మ్మడి తూర్పులోని రైతులకు దాదాపు రూ.35లక్షల నష్టం తప్పక పోవచ్చు. ఇదే సమస్యపై కర్ణాటకలో అమ్మకాలు నిలిచి పోయారు. దీంతో ఇబ్బందిని ఈ ప్రాంత రైతులు ఎంపీ పురందేశ్వరి దృష్టికి తీసు కెళ్లారు. ఆమె చొరవ తీసుకొని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లడంతోపాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వద్దకు పొగాకు రైతు సం ఘం నాయకులను ఢిల్లీ తీసుకెళ్లారు. దీంతో 18 శాతం సుంకాన్ని పూర్తిగా రద్దు చేస్తూ ఈ నెల 1న నోటిఫికేషన్ జారీ అయ్యింది. మన ప్రాంతం తోపాటు దేశంలోని పొగాకు రైతు లందరికీ మేలు చేకూరినట్లయ్యింది. ఐటీసీతోసహా 20 పెద్ద కంపె నీలు కొనుగోలుదారులుగా ఉన్నారు. ఈ ప్రాంతా నికి సంబంధించి దేవరపల్లిలో ఉన్న పొగాకు బోర్డు ప్రాంగణంలో అమ్మకం, కొనుగోలు ప్రక్రియ జరుగుతోంది. రాష్ట్రంలో చూస్తే ఏడాదికి 300 మిలియన్ల కిలోల పొగాకు సాగవుతుండగా.. 100 మిలియన్లు దేశీయంగా వివిధ ఉత్పత్తుల్లో వినియో గిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో 80 మిలి యన్ల కిలోల వర్జీనియా రకం పొగాకును సాగు చేస్తున్నారు.
రైతులకు ఉపశమనం
పురందేశ్వరి, ఎంపీ
పొగాకు రైతులు పన్ను సమస్యను నాకు చెప్పారు. ఇది తీవ్రమైన సమస్యగా భావించాం. వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లడం తోపాటు రైతులను ఆర్థిక మంత్రి వద్దకు తీసు కెళ్లగా వారి ఇబ్బందిని వివరించారు. దీంతో కేంద్ర ఎక్సయిజ్ పన్నును పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణ యం వెలువడింది. ఈ సడలింపు వల్ల పొగాకు రైతులకు ఊరట లభించడంతోపాటు వ్యవసాయ రంగానికి మరింత బలాన్ని ఇస్తుంది.
ఆందోళనలో పడిపోయాం
ఓబులనేని కృష్ణ చైతన్య, పొగాకు రైతు సంఘం
జిల్లా నాయకుడు
నెల రోజుల నుంచీ పొగాకు రైతులు ఆందోళనలో పడిపోయారు. వారసత్వం గా వచ్చిన వృత్తి మాదిరిగా పొగాకు సా గుకు అలవాటు పడిపోయాం. ఇప్పుడు కేంద్రం అధిక పన్ను విధించడంతో పంట చేతికొచ్చే దశ కావడంతో తీవ్రంగా అయో మయంలో పడిపోయాం. మా సమస్యను ఎంపీ పురందేశ్వరి దృష్టికి తీసుకెళ్లగానే కేంద్ర ఆర్థిక మంత్రి అపాయింట్‌మెంట్ తీసుకొని మమ్మల్ని తీసుకెళ్లారు. వెంటనే పన్ను రద్దు చేస్తూ నోటిఫి కేషన్ రావడంపై ఎంపీ పురందేశ్వరికి పొగాకు రైతుల తరఫున కృతజ్ఞతలు చెబుతున్నాం.