• Home » Andhra Pradesh » Chittoor

చిత్తూరు

కురిసింది వాన..

కురిసింది వాన..

మదనపల్లె, కురబలకోటలో సోమవారం సాయంత్రం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడ్డాయి. సాయంత్రం 5గంటల నుంచి ఆకాశం మేఘావృతమై వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.

రూ.10వేలు కడితే రూ.లక్ష రుణం

రూ.10వేలు కడితే రూ.లక్ష రుణం

పదిమంది మహిళలు సంఘంగా ఏర్పడి ఒక్కొక్కరు రూ.వెయ్యి చొప్పున రూ.10 వేలు చెల్లిస్తే రూ.లక్ష రుణమిస్తామని పుంగనూరు ప్రాంతంలో కొందరు ఏజెంట్లు డబ్బు వసూలు చేసి, మోసం చేశారంటూ బాధితులు ఆందోళన చెందుతున్నారు.

ఇక్కడ హంతకులు..అక్కడ జీవిత ఖైదీ

ఇక్కడ హంతకులు..అక్కడ జీవిత ఖైదీ

చిత్తూరు రూరల్‌ మండలం మంగాపురంలో ఆగస్టు 8వ తేది రాత్రి ఒక ఇంట్లో కాపలాదారు హత్య జరిగింది. నాటుబాంబు వేసి ఇంటి గ్లాస్‌ డోర్‌ పగలగొట్టారు. దోపిడీకి వచ్చారా.. హత్యకోసం వచ్చి దొంగతనం కలరింగ్‌ ఇచ్చారా.. ఇంతకీ దుండగులు ఎవరు?

లాహిరి లాహిరి లాహిరిలో..

లాహిరి లాహిరి లాహిరిలో..

కాణిపాకంలోని ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి వరసిద్ధుడు తెప్పపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. దీంతో ప్రత్యేక ఉత్సవాలు ముగిశాయి.

అంతర్రాష్ట్ర బైక్‌ దొంగల ముఠా అరెస్టు

అంతర్రాష్ట్ర బైక్‌ దొంగల ముఠా అరెస్టు

మూడు రాష్ట్రాల్లో బైక్‌లను చోరీ చేస్తూ తప్పించుకుని తిరుగుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను తిరుపతి వెస్ట్‌ పోలీసులు అరెస్టు చేశారు.

రైతులపైకి దూసుకొచ్చిన మదపుటేనుగు

రైతులపైకి దూసుకొచ్చిన మదపుటేనుగు

ఎర్రావారిపాళెం మండలం చింతగుంట పంచాయతీలోని పంట పొలాలపై పడుతున్న మదనపుటేనుగు చివరకు రైతులుపైకీ దూసుకొచ్చింది. దీంతో వారు ప్రాణభయంతో ఇళ్లకు పరుగులు తీశారు.

శ్రీనిధికి కోపమొచ్చింది..!

శ్రీనిధికి కోపమొచ్చింది..!

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ ఆస్థాన ఏనుగు శ్రీనిధికి కోపమొచ్చింది. తన మావటిపైనా దాడిచేసింది. తొండంతో కొట్టి.. కాలితో తొక్కింది. ఈ సంఘటనతో తిరుచానూరులో కలకలం రేగింది.

కృష్ణమ్మా..కడ వరకూ సాగమ్మా..!

కృష్ణమ్మా..కడ వరకూ సాగమ్మా..!

శ్రీసత్యసాయి జిల్లా కదిరి సమీపంలోని చెర్లోపల్లె రిజర్వాయర్‌ నుంచి కృష్ణా జలాలను సెప్టెంబరు 12వ తేదీన పుంగనూరు బ్రాంచి కెనాల్‌కు విడుదల చేశారు. అక్కడి నుంచి మొదలైన ప్రవాహం పీటీఎం మండలం బొంతలపల్లె వద్ద అన్నమయ్య జిల్లాలోకి ప్రవేశించాయి. బొంతలపల్లె చెరువు మొదలు కుప్పంలోని చివరి పరమసముద్రం చెరువును నింపుతున్నారు.

 పరిశ్రమలో ప్రమాదం

పరిశ్రమలో ప్రమాదం

శనివారం ఉదయం 8 గంటల సమయం....విధుల కోసం రెండు వాహనాల్లో కార్మికులు శ్రీసిటీలోని టిల్‌ హెల్త్‌కేర్‌ ఫ్యాక్టరీకి వచ్చారు. వాహనాల నుంచి దిగుతున్నంతలోనే ఫ్యాక్టరీ లోపలనుంచి భారీ శబ్దం. ఆ వెంటనే కమ్ముకున్న నల్లటి పొగ.... ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాక అందరిలోనూ భయాందోళన....శబ్దం బాయిలర్‌ పేలడం వల్ల వచ్చిందని తెలిశాక బాయిలర్‌ ఉన్న భవనం వైపు చూస్తే అది నేలమట్టమై కనిపించింది.బాయిలర్‌, భవన శకలాలు కొంతదూరం ఎగసి పడి ఉన్నాయి.ఆర్తనాదాలు వినిపించడంతో లోపల తమ సహచరులు ప్రమాదంలో చిక్కుకున్నారని అర్థమవడంతో వారిని కాపాడడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.అప్పటికే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.తీవ్రంగా గాయపడ్డ మరో ముగ్గురిని ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఆ ముగ్గురూ కూడా మృత్యువాత పడ్డారు. మృతులు వీరే

విరుల పల్లకిపై విఘ్నరాజు విహారం

విరుల పల్లకిపై విఘ్నరాజు విహారం

కాణిపాకం ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారు పుష్ప పల్లకిపై విహరించారు. ఉదయం మూలవిరాట్‌కు ఉభయదారుల ఆధ్వర్యంలో తొలుత స్వామిని అభిషేకించాక చందనాలంకారాన్ని నిర్వహించారు. శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. రా



తాజా వార్తలు

మరిన్ని చదవండి