మరో భారీ పెట్టుబడి
ABN , Publish Date - Feb 20 , 2026 | 01:18 AM
జిల్లాలో ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఏర్పాటవుతున్న పరిశ్రమలకు అదనంగా మరో రూ.1,436కోట్ల పెట్టుబడులు రానున్నాయి. సైబర్‌సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ దివ్యశ్రీ హోల్డింగ్స్ కన్సార్టియం పేరిట నిర్మాణ రంగంలో రూ. 1,229కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. తమ పెట్టుబడితో జిల్లాలో 1500ఉద్యోగాలు కల్పిస్తామంటూ ప్రతిపాదించింది. అలాగే ఇప్పటికే జిల్లాలో ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ విస్తరణలో భాగంగా రూ.209కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపింది. ఈ పెట్టుబడులతో 35ఉద్యోగాలు కల్పిస్తామంటూ ప్రతిపాదించింది. రెండు సంస్థల ప్రతిపాదనలపై బుధవారం అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు చర్చించి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం అమల్లో ఉన్న పారిశ్రామిక విధానానికి అనుగుణంగా పలు రాయితీలు ఇచ్చేందుకు కూడా ఆమోదం తెలిపింది. దీంతో జిల్లాకు కొత్తగా రూ.1,436కోట్ల పెట్టుబడులు, 1,535ఉద్యోగాలు రావడానికి అవకాశం ఏర్పడింది.
-సైబర్‌సిటీ బిల్డర్స్, హెరిటేజ్ సంస్థల
ప్రతిపాదనకు ఎస్‌ఐపీబీ ఆమోదం
- రూ. 1,436కోట్ల వ్యయంతో
1,535ఉద్యోగాలకు అవకాశం
తిరుపతి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఏర్పాటవుతున్న పరిశ్రమలకు అదనంగా మరో రూ.1,436కోట్ల పెట్టుబడులు రానున్నాయి. సైబర్‌సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ దివ్యశ్రీ హోల్డింగ్స్ కన్సార్టియం పేరిట నిర్మాణ రంగంలో రూ. 1,229కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. తమ పెట్టుబడితో జిల్లాలో 1500ఉద్యోగాలు కల్పిస్తామంటూ ప్రతిపాదించింది. అలాగే ఇప్పటికే జిల్లాలో ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ విస్తరణలో భాగంగా రూ.209కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపింది. ఈ పెట్టుబడులతో 35ఉద్యోగాలు కల్పిస్తామంటూ ప్రతిపాదించింది. రెండు సంస్థల ప్రతిపాదనలపై బుధవారం అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు చర్చించి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం అమల్లో ఉన్న పారిశ్రామిక విధానానికి అనుగుణంగా పలు రాయితీలు ఇచ్చేందుకు కూడా ఆమోదం తెలిపింది. దీంతో జిల్లాకు కొత్తగా రూ.1,436కోట్ల పెట్టుబడులు, 1,535ఉద్యోగాలు రావడానికి అవకాశం ఏర్పడింది.