జిల్లావ్యాప్తంగా ఆదివారం పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. చిత్తూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎమ్మెల్యే జగన్మోహన్, మేయర్ అముద పిల్లలకు పోలియో చుక్కలు వేశారు.
ఈ ఏడాది మున్నెన్నడూ లేని విధంగా చలి వణికిస్తోంది. ఈనెల ఆరంభం నుంచే తీవ్ర ప్రభావం చూపుతోంది. పదేళ్లల్లో ఈ స్థాయిలో రాత్రి ఉష్ణోగ్రతలు ఎప్పుడూ పడిపోలేదని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో సాధారణంగా ఈనెలాఖరున, జనవరి ఆరంభంలో కొద్ది రోజులు పాటు 10 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి.
తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షురాలిగా టీడీపీ మొదటిసారిగా ఓ మహిళకు అవకాశం కల్పించింది. కేంద్ర మాజీ మంత్రి, టీటీడీ పాలకమండలి సభ్యురాలు పనబాక లక్ష్మిని ఈ పదవికి ఎంపిక చేసింది. ప్రధాన కార్యదర్శిగా తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిని నియమించింది.
చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా షణ్ముగ రెడ్డి, సునీల్ కుమార్ చౌదరి నియమితులయ్యారు.కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించేలా అధ్యక్షుడిగా పుత్తూరుకు చెందిన షణ్ముగరెడ్డిని, ప్రధాన కార్యదర్శిగా తవణంపల్లెకు చెందిన సునీల్‌కుమార్ చౌదరిని నియమించారు.
పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రతను అలవాటు చేసేందుకు పార్వతీపురం జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ముస్తాబు అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమం గురించి విద్యార్థుల ద్వారా తెలుసుకుని దాని రూపకర్త మన్యం జిల్లా కలెక్టర్ నక్కల ప్రభాకర రెడ్డిని అభినందించారు.
నేలమీద వ్యవసాయం మనకు తెలుసు. నీటిమీద సాగు మనకు సరికొత్త వ్యవసాయ విధానం. అందునా సముద్రంలో సేద్యం.. ఎలా సాధ్యం అని ఆశ్చర్యం సహజం. ఇప్పుడా వ్యవసాయం మన తిరుపతి జిల్లాలోనే ప్రయోగాత్మకంగా మొదలైంది. అత్యంత విలువైన సముద్రపు నాచును బంగాళాఖాతంలో వాకాడు, తడ మండలాల్లోని మత్స్యకార మహిళలు పండిస్తున్నారు.
చదవడం, రాయడం, ప్రాథమిక గణితం ఇవే విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు. ప్రభుత్వం అందుకే ప్రాథమిక స్థాయి విద్య బలోపేతంపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే 75 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక గ్యారెంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (జీఎ్‌ఫఎల్‌ఎన్) కార్యక్రమాన్ని రూపొందించింది.
విద్యార్థులకు శాస్త్రసాంకేతిక రంగాలపై అవగాహన ఉండాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. నాయుడుపేట జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం జిల్లా స్థాయి సైన్స్‌ఫెయిర్ కార్యక్రమాన్ని ఆమె టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం, సర్వశిక్ష అభియాన్ జిల్లా అధికారి గౌరీశంకర్‌రావు, డీఈవో కేవీఎస్ కుమార్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాక వరసిద్ధుడి ఆలయ ప్రాంగణం త్వరలో కొత్తరూపు సంతరించుకోనుంది. ఆలయం ముందు నుంచి పుష్కరిణిని 60 అడుగుల దూరంలోకి మార్చనున్నారు.
విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే నైపుణ్యాలు పెంచుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. విద్యాశాఖ-సమగ్రశిక్ష సంయుక్తంగా శనివారం స్థానిక జ్యోతిరావ్ పూలే భవనంలో ఏర్పాటు చేసిన కెరీర్ ఎక్స్‌పో, ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించి, ప్రసంగించారు.