పందులకోసం పెట్టిన కరెంటు తీగలు తగిలి వ్యక్తి మృతి
ABN , Publish Date - Feb 20 , 2026 | 01:31 AM
పంట పొలాలను నాశనం చేస్తున్న పందులను అడ్డుకోవడానికి ఆ రైతు విద్యుత్తు తీగలు లాగారు. చీకట్లో ఆ వైర్లను తొక్కి ఓ వ్యక్తి మృతిచెందారు. ఆ మృతదేహానికి రాయికట్టి పక్కన చెరువులో రైతు పడేశారు. బుధవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనపై గురువారం రాత్రి కేసు నమోదైంది. వివరాలిలా ఉన్నాయి. గంగాధరనెల్లూరు మండలం పాపిరెడ్డిపల్లె పంచాయతీ మారేడు గ్రామానికి చెందిన రామ్మూర్తిరెడ్డి(37) బుధవారం రాత్రి కృష్ణాపురం వెళ్లొస్తానని ఇంట్లో చెప్పి ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. మార్గమధ్యలో ఓ చోట ఆపి.. శ్రీనివాసులురెడ్డి పొలంలోకి వెళ్లారు. ఆ రైతు పందుల బెడద నివారణ కోసం పెట్టిన విద్యుత్తు తీగలను.. చీకట్లో తెలియక తొక్కడంతో విద్యుదాఘాతానికి గురయ్యారు. అక్కడికక్కడే మృతిచెందారు. తన పొలంలో విద్యుత్ తీగల వల్ల రామ్మూర్తిరెడ్డి చనిపోయాడని తెలుసుకున్న ఆ రైతు.. మృతదేహానికి రాయికట్టి సమీపంలోని చెరువు వద్దకు తీసుకెళ్లి పడేశారు. ఎంతకీ రామ్మూర్తిరెడ్డి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు, బంధువులు చుట్టుపక్కల వెదికారు. ఈ క్రమంలో శ్రీనివాసులురెడ్డి పొలం వద్ద ద్విచక్ర వాహనాన్ని గుర్తించారు. ఆ ప్రాంతంలో వెదికారు. చెరువులో చేయి కనపడటంతో బయటకు లాగారు. రామ్మూర్తిరెడ్డి మృతదేహానికి రాయి కట్టి ఉండటంతో ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదని తేలింది. దీంతో వీరు రైతు శ్రీనివాసులురెడ్డిని అనుమానించి.. ఆయన ఇంటికెళ్లారు. గట్టిగా నిలదీయడంతో జరిగిన విషయాన్ని ఆయన చెప్పినట్లు తెలిసింది. ఈ మేరకు మృతుడి కటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గురువారం రాత్రి సీఐ ప్రసాద్ తెలిపారు.
మృతదేహానికి రాయికట్టి చెరువులో పడేసిన రైతు
గంగాధరనెల్లూరు, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): పంట పొలాలను నాశనం చేస్తున్న పందులను అడ్డుకోవడానికి ఆ రైతు విద్యుత్తు తీగలు లాగారు. చీకట్లో ఆ వైర్లను తొక్కి ఓ వ్యక్తి మృతిచెందారు. ఆ మృతదేహానికి రాయికట్టి పక్కన చెరువులో రైతు పడేశారు. బుధవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనపై గురువారం రాత్రి కేసు నమోదైంది. వివరాలిలా ఉన్నాయి. గంగాధరనెల్లూరు మండలం పాపిరెడ్డిపల్లె పంచాయతీ మారేడు గ్రామానికి చెందిన రామ్మూర్తిరెడ్డి(37) బుధవారం రాత్రి కృష్ణాపురం వెళ్లొస్తానని ఇంట్లో చెప్పి ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. మార్గమధ్యలో ఓ చోట ఆపి.. శ్రీనివాసులురెడ్డి పొలంలోకి వెళ్లారు. ఆ రైతు పందుల బెడద నివారణ కోసం పెట్టిన విద్యుత్తు తీగలను.. చీకట్లో తెలియక తొక్కడంతో విద్యుదాఘాతానికి గురయ్యారు. అక్కడికక్కడే మృతిచెందారు. తన పొలంలో విద్యుత్ తీగల వల్ల రామ్మూర్తిరెడ్డి చనిపోయాడని తెలుసుకున్న ఆ రైతు.. మృతదేహానికి రాయికట్టి సమీపంలోని చెరువు వద్దకు తీసుకెళ్లి పడేశారు. ఎంతకీ రామ్మూర్తిరెడ్డి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు, బంధువులు చుట్టుపక్కల వెదికారు. ఈ క్రమంలో శ్రీనివాసులురెడ్డి పొలం వద్ద ద్విచక్ర వాహనాన్ని గుర్తించారు. ఆ ప్రాంతంలో వెదికారు. చెరువులో చేయి కనపడటంతో బయటకు లాగారు. రామ్మూర్తిరెడ్డి మృతదేహానికి రాయి కట్టి ఉండటంతో ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదని తేలింది. దీంతో వీరు రైతు శ్రీనివాసులురెడ్డిని అనుమానించి.. ఆయన ఇంటికెళ్లారు. గట్టిగా నిలదీయడంతో జరిగిన విషయాన్ని ఆయన చెప్పినట్లు తెలిసింది. ఈ మేరకు మృతుడి కటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గురువారం రాత్రి సీఐ ప్రసాద్ తెలిపారు.