ఘనంగా గిరిప్రదక్షిణ
ABN , Publish Date - Feb 20 , 2026 | 01:35 AM
శ్రీకాళహస్తీశ్వరాలయ మహాశివరాత్రి ఉత్సవాల్లో గురువారం శివపార్వతుల గిరిప్రదక్షిణ వేడుకగా జరిగింది. తమ కల్యాణానికి విచ్చేసిన సకల దేవతాగణాలకు, రుషులకు ఆదిదంపతులు ఘనంగా వీడ్కోలు పలికి కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు ఆలయంలో శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞానప్రసూనాంబదేవి ఉత్సవమూర్తులను అలంకార మండపంలో విశేషంగా అలంకరించి చప్పరాలపై గిరిప్రదక్షిణకు తీసుకెళ్లారు. రాజగోపురం నుంచి శివపార్వతులు చతుర్మాడవీధులోకి ప్రవేశించాక భేరివారి మండపం వద్ద భేరి కులస్థులు ఇచ్చిన నాగవల్లిని అమ్మవారికి ధరింపజేశారు. జయరామరావు వీధి, ఎన్టీఆర్ నగర్, తెలుగుగంగకాలనీ, కైలాసగిరికాలనీ, రాజీవ్‌నగర్‌కాలనీ మీదుగా రామాపురం రిజర్వాయరు సమీపానికి చేరుకున్న స్వామి అమ్మవార్లు అంజూరు మండపం వద్ద విశ్రాంతి తీసుకున్నారు. అక్కడ పూజలు నిర్వహించాక భక్తులకు అన్నప్రసాదాలు అందజేశారు.అక్కడినుంచి వెయ్యిలింగాలకోన, వేడాం మీదుగా శుకబ్రహ్మాశ్రమ సమీపంలోని ఎదురుసేవ మండపానికి స్వామి అమ్మవార్లు సాయంత్రానికి చేరుకున్నారు.ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు స్వాగతం పలికి పూజలు నిర్వహించారు. అనంతరం శివపార్వతుల ఉత్సవమూర్తులను రాత్రి 8గంటలకు ముక్కంటి ఆలయానికి తీసుకువచ్చారు.కొద్దిసేపు విశ్రాంతి అనంతరం శ్రీకాళహస్తీశ్వరుడు అశ్వవాహనంపై, జ్ఞానప్రసూనాంబదేవి సింహవాహనంపై పురవిహారం చేశారు. ఆలయ చైర్మన్ కొట్టే సాయి, ఈవో బాపిరెడ్డి, సినీనటి శ్రియాచరణ్, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి దంపతులు, ధర్మకర్తలమండలి సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
దేవతాగణాలకు ఆదిదంపతుల వీడ్కోలు
అశ్వ, సింహవాహనాలపై పురవిహారం
శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తీశ్వరాలయ మహాశివరాత్రి ఉత్సవాల్లో గురువారం శివపార్వతుల గిరిప్రదక్షిణ వేడుకగా జరిగింది. తమ కల్యాణానికి విచ్చేసిన సకల దేవతాగణాలకు, రుషులకు ఆదిదంపతులు ఘనంగా వీడ్కోలు పలికి కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు ఆలయంలో శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞానప్రసూనాంబదేవి ఉత్సవమూర్తులను అలంకార మండపంలో విశేషంగా అలంకరించి చప్పరాలపై గిరిప్రదక్షిణకు తీసుకెళ్లారు. రాజగోపురం నుంచి శివపార్వతులు చతుర్మాడవీధులోకి ప్రవేశించాక భేరివారి మండపం వద్ద భేరి కులస్థులు ఇచ్చిన నాగవల్లిని అమ్మవారికి ధరింపజేశారు. జయరామరావు వీధి, ఎన్టీఆర్ నగర్, తెలుగుగంగకాలనీ, కైలాసగిరికాలనీ, రాజీవ్‌నగర్‌కాలనీ మీదుగా రామాపురం రిజర్వాయరు సమీపానికి చేరుకున్న స్వామి అమ్మవార్లు అంజూరు మండపం వద్ద విశ్రాంతి తీసుకున్నారు. అక్కడ పూజలు నిర్వహించాక భక్తులకు అన్నప్రసాదాలు అందజేశారు.అక్కడినుంచి వెయ్యిలింగాలకోన, వేడాం మీదుగా శుకబ్రహ్మాశ్రమ సమీపంలోని ఎదురుసేవ మండపానికి స్వామి అమ్మవార్లు సాయంత్రానికి చేరుకున్నారు.ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు స్వాగతం పలికి పూజలు నిర్వహించారు. అనంతరం శివపార్వతుల ఉత్సవమూర్తులను రాత్రి 8గంటలకు ముక్కంటి ఆలయానికి తీసుకువచ్చారు.కొద్దిసేపు విశ్రాంతి అనంతరం శ్రీకాళహస్తీశ్వరుడు అశ్వవాహనంపై, జ్ఞానప్రసూనాంబదేవి సింహవాహనంపై పురవిహారం చేశారు. ఆలయ చైర్మన్ కొట్టే సాయి, ఈవో బాపిరెడ్డి, సినీనటి శ్రియాచరణ్, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి దంపతులు, ధర్మకర్తలమండలి సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
నేడు ధ్వజావరోహణం
మహాశివరాత్రి ఉత్సవాల్లో శుక్రవారం ధ్వజావరోహణ కార్యక్రమాన్ని ఆలయంలో వేదోక్తంగా నిర్వహించనున్నారు. ఈ విశేషోత్సవాన్ని పురస్కరించుకొని స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ఉదయం వసంతోత్సవ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.ఉదయం పురవీధుల ఉత్సవం పూర్తయ్యాక ఉత్సవమూర్తులను తిరుమంజన గోపురం సమీపంలోని వసంత మండపానికి తీసుకెళ్లి వసంతోత్సవాలను నిర్వహించనున్నారు.