క్యాబేజీకి ధరాఘాతం
ABN , Publish Date - Feb 20 , 2026 | 01:33 AM
క్యాబేజి, క్యాలీఫ్లవర్ ధరల పతనంతో రైతులు కుదేలయ్యారు. ఈ సీజన్‌లో మంచి ధరలు వస్తాయనే ఆశతో పలమనేరు, గంగవరం, బైరెడ్డిపల్లె, పెద్దపంజాణి మండలాల్లో ఈ పంటలను రైతులు భారీగా సాగు చేశారు. సాధారణ కూరగాయల కంటే క్యాబేజి సాగుకు పెట్టుబడి వ్యయం ఎక్కువే. సంప్రదాయ, రసాయన ఎరువులను వినియోగిస్తున్నారు. నెల రోజులుగా క్యాబేజి ఒక సంచి (35నుంచి 40 కిలోల బస్తా) రూ.200నుంచి 240 ధర పలకడంలేదు. చెన్నె మార్కెట్‌లో సరైన ధర లేకపోవడం, ఇక్కడి మార్కెట్‌పైనా ప్రభావం చూపుతోందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో కూలీల ఖర్చు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లుగా విస్తారంగా వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో రైతులు విస్తారంగా క్యాబేజి, క్యాలిఫ్లవర్ సాగుకు మొగ్గు చూపారు. దిగుబడి బాగానే వచ్చినా ధరల పతనంతో నష్టాల్లో మునిగిపోయారు.
పలమనేరు, ఆంధ్రజ్యోతి : క్యాబేజి, క్యాలీఫ్లవర్ ధరల పతనంతో రైతులు కుదేలయ్యారు. ఈ సీజన్‌లో మంచి ధరలు వస్తాయనే ఆశతో పలమనేరు, గంగవరం, బైరెడ్డిపల్లె, పెద్దపంజాణి మండలాల్లో ఈ పంటలను రైతులు భారీగా సాగు చేశారు. సాధారణ కూరగాయల కంటే క్యాబేజి సాగుకు పెట్టుబడి వ్యయం ఎక్కువే. సంప్రదాయ, రసాయన ఎరువులను వినియోగిస్తున్నారు. నెల రోజులుగా క్యాబేజి ఒక సంచి (35నుంచి 40 కిలోల బస్తా) రూ.200నుంచి 240 ధర పలకడంలేదు. చెన్నె మార్కెట్‌లో సరైన ధర లేకపోవడం, ఇక్కడి మార్కెట్‌పైనా ప్రభావం చూపుతోందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో కూలీల ఖర్చు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లుగా విస్తారంగా వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో రైతులు విస్తారంగా క్యాబేజి, క్యాలిఫ్లవర్ సాగుకు మొగ్గు చూపారు. దిగుబడి బాగానే వచ్చినా ధరల పతనంతో నష్టాల్లో మునిగిపోయారు.