శరవేగంగా పారిశ్రామికాభివృద్ధి
ABN , Publish Date - Feb 20 , 2026 | 01:37 AM
జిల్లాలో శరవేగంగా పారిశ్రామికాభివృద్ధి జరుగుతోందని కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. తిరుచానూరు సమీపంలోని తాజ్‌హోటల్ వేదికగా సీఐఐ(భారత పరిశ్రమల సమాఖ్య) తిరుపతి జోన్ వార్షిక సమీక్ష గురువారం జరిగింది.కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు విస్తృత ప్రోత్సాహకాలు అందిస్తున్నారని చెప్పారు. జిల్లాకు తిరుపతి, చెన్నై విమానాశ్రయాలతోపాటు ప్రధానపోర్టులు, రైల్వే నెట్‌వర్క్ ఉందన్నారు. సాగరమాల రోడ్డు ప్రాజెక్టు కింద రూ.6వేల కోట్లకుపైగా వెచ్చించి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రె్‌సవేలు నిర్మాణంలో ఉన్నాయన్నారు. రూ.6,500కోట్లకుపైగా రైల్వేప్రాజెక్టు పనులు జరుగుతున్నాయన్నారు. హైస్పీడ్ రైలుమార్గాలు జిల్లా గుండా వెళుతున్నాయన్నారు. నాయుడుపేట ఇండస్ట్రియల్ పార్కు రాష్ట్రంలో అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతంగా మారిందన్నారు. ఇప్పటికే తిరుపతి నగరంలో 8,900 హోమ్‌స్టేలు ఉన్నాయని.. ఇక ఫైవ్‌స్టార్ హోటళ్లు కూడా పెద్దఎత్తున వస్తున్నాయని తిరుపతిని డెస్టివేషన్ వెడ్డింగ్ కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ముందుంటుందని, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలన్నారు. సీఐఐ రాష్ట్ర చైర్మన్ మురళీకృష్ణ, సీఐఐ తిరుపతి చైర్మన్ జగన్నాథ్ అనిరుధ్ మాట్లాడుతూ.. పరిశ్రమల అభివృద్ధిలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం దృష్టి సారించడం శుభపరిణామమని చెప్పారు. ఎలకా్ట్రనిక్, ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్ వంటి ఎన్నో జిల్లాకు వచ్చాయన్నారు. సీఐఐ ప్రతినిధులు నరేంద్రకుమార్, సాంబశివరావు, దామోదర నాయుడు, డాక్టర్ రమాదేవి తదితరులు ప్రసంగించారు. సీఐఐ తిరుపతి జోన్ వైస్ చైర్మన్‌గా శ్రీనివాస్ ఎంపికయ్యారు.
- రూ.6వేలకోట్లతో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రె్‌సవేలు
- సీఐఐ సదస్సులో కలెక్టర్ వెంకటేశ్వర్
తిరుపతి(కలెక్టరేట్), ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శరవేగంగా పారిశ్రామికాభివృద్ధి జరుగుతోందని కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. తిరుచానూరు సమీపంలోని తాజ్‌హోటల్ వేదికగా సీఐఐ(భారత పరిశ్రమల సమాఖ్య) తిరుపతి జోన్ వార్షిక సమీక్ష గురువారం జరిగింది.కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు విస్తృత ప్రోత్సాహకాలు అందిస్తున్నారని చెప్పారు. జిల్లాకు తిరుపతి, చెన్నై విమానాశ్రయాలతోపాటు ప్రధానపోర్టులు, రైల్వే నెట్‌వర్క్ ఉందన్నారు. సాగరమాల రోడ్డు ప్రాజెక్టు కింద రూ.6వేల కోట్లకుపైగా వెచ్చించి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రె్‌సవేలు నిర్మాణంలో ఉన్నాయన్నారు. రూ.6,500కోట్లకుపైగా రైల్వేప్రాజెక్టు పనులు జరుగుతున్నాయన్నారు. హైస్పీడ్ రైలుమార్గాలు జిల్లా గుండా వెళుతున్నాయన్నారు. నాయుడుపేట ఇండస్ట్రియల్ పార్కు రాష్ట్రంలో అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతంగా మారిందన్నారు. ఇప్పటికే తిరుపతి నగరంలో 8,900 హోమ్‌స్టేలు ఉన్నాయని.. ఇక ఫైవ్‌స్టార్ హోటళ్లు కూడా పెద్దఎత్తున వస్తున్నాయని తిరుపతిని డెస్టివేషన్ వెడ్డింగ్ కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ముందుంటుందని, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలన్నారు. సీఐఐ రాష్ట్ర చైర్మన్ మురళీకృష్ణ, సీఐఐ తిరుపతి చైర్మన్ జగన్నాథ్ అనిరుధ్ మాట్లాడుతూ.. పరిశ్రమల అభివృద్ధిలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం దృష్టి సారించడం శుభపరిణామమని చెప్పారు. ఎలకా్ట్రనిక్, ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్ వంటి ఎన్నో జిల్లాకు వచ్చాయన్నారు. సీఐఐ ప్రతినిధులు నరేంద్రకుమార్, సాంబశివరావు, దామోదర నాయుడు, డాక్టర్ రమాదేవి తదితరులు ప్రసంగించారు. సీఐఐ తిరుపతి జోన్ వైస్ చైర్మన్‌గా శ్రీనివాస్ ఎంపికయ్యారు.