చంద్రబాబు ఉంటే తిరుపతి ఎప్పుడూ బాగుంటుంది
ABN , Publish Date - Feb 20 , 2026 | 09:28 AM
చంద్రబాబు మళ్లీ సీఎం కావడం, పవన్ కల్యాణ్ కూడా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని నటుడు చరణ్‌రాజ్ అన్నారు.
నటుడు చరణ్ రాజ్
తిరుమల: చంద్రబాబు మళ్లీ సీఎం కావడం, పవన్ కల్యాణ్ కూడా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని నటుడు చరణ్‌రాజ్(Actor Charanraj) అన్నారు. తిరుమల శ్రీవారిని గురువారం దర్శించుకున్న ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సీఎంగా వస్తే తిరుపతి(Tiripati) ఎప్పుడూ బాగుటుందన్నారు. ఏర్పాట్లు చాలా బాగున్నాయని, భక్తులు కూడా సంతోషంగా ఉన్నారన్నారు.
పేద, చిన్న అనే తేడా లేకుండా అందరు సులభంగా వెళ్లి స్వామిని దర్శించుకుని వస్తున్నారన్నారు. ఇక, తమిళంలో రెండు, మూడు సినిమాలతోపాటు తెలుగులోనూ ఓ చిత్రంలో నటిస్తున్నానన్నారు. ముఖ్యంగా తన దర్శకత్వంలో తన కుమారుడు హీరోగా నటిస్తున్నాడని.. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడలో విడుదల కానుందని సంతోషం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
సాక్షి మీడియా పై రూ.100 కోట్ల పరువు నష్టం వేసిన హెరిటేజ్..
Read Latest Telangana News and National News