• Home » Andhra Pradesh » Chittoor

చిత్తూరు

Kuppam: కుప్పానికి మరో రెండు పరిశ్రమలు

Kuppam: కుప్పానికి మరో రెండు పరిశ్రమలు

కుప్పం నియోజకవర్గానికి రూ.2979 కోట్ల పెట్టుబడితో మరో రెండు భారీ పరిశ్రమలు రానున్నాయి. రాష్ట్ర రాజధానిలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Industries: 4 పరిశ్రమలు..  రూ.3,972 కోట్లు

Industries: 4 పరిశ్రమలు.. రూ.3,972 కోట్లు

శ్రీసిటీలో రూ.1,629 కోట్లు, నాయుడుపేటలో రూ.2,343 కోట్ల చెప్పున రూ.3,972 కోట్లతో నాలుగు పరిశ్రమల ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

High alert: ఢిల్లీలో పేలుడుతో హైఅలర్ట్‌

High alert: ఢిల్లీలో పేలుడుతో హైఅలర్ట్‌

డిల్లీలో సోమవారం సాయంత్రం జరిగిన బాంబు పేలుడు ఘటనతో తిరుపతిలో హై అలర్ట్‌ ప్రకటించారు.

TTD: వేదం.. వివాదం

TTD: వేదం.. వివాదం

టీటీడీ చేపట్టిన వేదపారాయణ పోస్టుల ఇంటర్వ్యూల్లో తొలిరోజే వివాదం మొదలైంది. 700 పోస్టులకుగాను తిరుపతిలోని శ్వేతలో సోమవారం మొదలైన ఇంటర్వ్యూలు 16వ తేదీ వరకు జరగనున్నాయి.

Transportation: ఒడిశా టూ శివకాశి

Transportation: ఒడిశా టూ శివకాశి

ఒడిశా నుంచి తిరుపతి మీదుగా తమిళనాడుకు తరలిస్తున్న 32 కిలోల గంజాయిని చంద్రగిరి పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు పొన్నుస్వామి సెల్వరాజ్‌ను అరెస్టు చేశారు.

Jewelry theft: నగల కోసం దురాగతం

Jewelry theft: నగల కోసం దురాగతం

నగల దొంగతనానికి అడ్డుపడిందని ఓ మహిళను హతమార్చిన వైనమిది,

Died: నీటమునిగిన మామా అల్లుళ్లు

Died: నీటమునిగిన మామా అల్లుళ్లు

ఎద్దులను శుభ్రం చేసేందుకు కుంటలోకి దిగిన మేనమామ, మేనల్లుడు నీట మునిగి చనిపోయిన వైనమిది.

ముసలి మడుగులో రెండు గంటలు

ముసలి మడుగులో రెండు గంటలు

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పలమనేరు పర్యటన విజయవంతంగా ముగిసింది. ఆయన్ను చూసేందుకు పెద్దఎత్తున అభిమానులు ఎగబడ్డారు. వారి తాకిడిని తట్టుకోలేక పోలీసులు ఆ ప్రాంతమంతా ఆంక్షలు విధించారు. షెడ్యూల్‌ కంటే గంట ఆలస్యంగా పలమనేరు సమీపంలోని పెంగరగుంట వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్‌ వద్దకు చేరుకున్న పవన్‌కు స్వాగతం పలికేందుకు కేవలం 8మందినే లోపలికి అనుమతించారు. జనసేన నాయకులు చాలామందికి అనుమతి లభించకపోవడంతో నిరాశతో వెనుతిరిగారు.ఎమ్మెల్యేలు అమరనాథ రెడ్డి, జగన్మోహన్‌, మురళీమోహన్‌, చుడా ఛైర్‌పర్సన్‌ హేమలత, జనసేన జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్‌,కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఎస్పీ తుషార్‌, డీఎ్‌ఫవో సుబ్బరాజు తదితరులు పవన్‌కు స్వాగతం పలికారు. హెలిపాడ్‌ చుట్టూ తన కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు పవన్‌ అభివాదం చేశారు. ఎమ్మెల్యే గురజాల సూచన మేరకు తమిళనాడు నుంచి వచ్చిన అభిమానుల వద్దకు వెళ్లి సెల్ఫీ తీసుకున్నారు. హెలిపాడ్‌ బయట పలువురు ఆయనకు సమస్యల మీద అర్జీలు ఇచ్చారు. అక్కడి నుంచి కారులో నేరుగా ఎలిఫెంట్‌ క్యాంపు వద్దకు వెళ్లిన పవన్‌ అటవీశాఖ అధికారుల పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ను తిలకించారు.అటవీ శాఖ ఆధ్వర్యంలో ‘ఏనుగులతో మనుషులకు జరుగుతున్న అన్నిరకాల నష్టాల్ని తగ్గించే చర్యలు’ అనే అంశంపై నిర్వహించిన ఈ ప్రజంటేషన్‌ చూశాక అధికారులకు పలు సూచనలు చేశారు. హనుమాన్‌ ప్రాజెక్టుకు సంబంధించిన పోస్టరును ఆవిష్కరించారు.కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించారు.దాదాపు రెండుగంటల పాటు ముసలిమడుగులో వున్న పవన్‌ ఆద్యంతం చలాకీగా గడిపారు. నిరాశలో జనసేన శ్రేణులు

ముక్కంటీశుడికి లక్షార్చన

ముక్కంటీశుడికి లక్షార్చన

: శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆదివారం వేదోక్తంగా లక్ష బిల్వ, కుంకుమార్చన వేడుకలు నిర్వహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయ అనువంశిక ప్రధాన అర్చకుడు స్వామినాథన్‌ గురుకుల్‌ ఆధ్వర్యంలో సంకల్పం పూజలు నిర్వహించారు. అలంకార మండపంలో మధ్యాహ్నం వరకు మూడు కాలాల పాటు రుత్వికులు అర్చనలు చేశారు. సాయంత్రం నాల్గో కాలం అర్చన చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ కొట్టే సాయిప్రసాద్‌, సభ్యులు, ప్రధాన అర్చకులు, ఆలయాధికారులు పాల్గొన్నారు.

వరసిద్ధుడి దర్శనానికి 4 గంటలు

వరసిద్ధుడి దర్శనానికి 4 గంటలు

కాణిపాక వరసిద్ధుడి దర్శనానికి ఆదివారం నాలుగు గంటల సమయం పట్టింది. సెలవు రోజు కావంతో వేలాదిగా భక్తులు తరలివచ్చారు. క్యూలైన్లు పూర్తిగా నిండి పోయి ఆలయం వెలుపల వరకు వ్యాపించాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి