Share News

వికసిత్ భారత్ దిశగా బ్యాలెన్స్‌డ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Feb 01 , 2026 | 04:33 PM

2047 వికసిత్ భారత్ దిశగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ(ఆదివారం) బ్యాలెన్స్‌డ్ బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్‌తో ఏపీకి కొత్త అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు..

వికసిత్ భారత్ దిశగా బ్యాలెన్స్‌డ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu Naidu

చిత్తూరు, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): 2047 వికసిత్ భారత్ దిశగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ(ఆదివారం) బ్యాలెన్స్‌డ్ బడ్జెట్ ప్రవేశ పెట్టిందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్‌తో ఏపీకి కొత్త అవకాశాలు వస్తాయని వివరించారు. ఇది ఫార్వార్డ్ లుకింగ్ బడ్జెట్ అని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌ను స్వాగతిస్తున్నానని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఆదివారం కుప్పంలో సీఎం పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.


యువత సాధికారిత సాధించేలా బడ్జెట్..

రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిన అంశాల్లో మరింతగా దూకుడుగా వెళ్లేందుకు ఈ బడ్జెట్ సహకరించేలా ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రం అమలు చేస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విదానానికి ఈ బడ్జెట్ మరింత సహకరించేలా ఉందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎంఎస్ఎంఈలపై ఎక్కువగా దృష్టి సారించిందని... వీటిని మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. మహిళలు, రైతులు, యువత సాధికారిత సాధించేలా బడ్జెట్ ఉందని చెప్పుకొచ్చారు. 2047 వికసిత్ భారత్ డెవలప్‌మెంట్ ఎకానమీగా మారేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. ఆర్థిక మంత్రి బ్యాలెన్స్‌డ్ బడ్జెట్ ప్రవేశపెట్టారని ప్రశంసించారు. ఏఐతో సహా వివిధ టెక్నాలజీలు, నెక్స్ట్ లెవల్ ఆఫ్ రిఫార్మ్స్‌కు వెళ్తుందని పేర్కొన్నారు.


దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్..

రెన్యువబుల్ ఎనర్జీ, వన్ గ్రిడ్ నేషన్ దిశగా బడ్జెట్ ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించారు. మెరుగైన జీవన ప్రమాణాలు, ఈజ్ ఆఫ్ లివింగ్ కోసం దోహదం చేసేలా బడ్జెట్ ఉంది. హైదరాబాద్-బెంగుళూరు, హైదరాబాద్ - చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ ద్వారా రాష్ట్రానికి ఉపయోగం ఉంది. తిరుపతి, అమరావతి వంటి ప్రాంతాలు ఈ హైస్పీడ్ కారిడార్లల్లో కవర్ అవుతాయి. బెంగుళూరు - చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ వల్ల పలమనేరు, చిత్తూరు, తదితర ప్రాంతాలు కవర్ అవుతాయి. ఈ మూడు హైస్పీడ్ రైల్ కారిడార్లు ఏపీలోని వివిధ ప్రాంతాలను కవర్ చేస్తాయి. హైదరాబాద్, అమరావతి, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలు అన్ని అనుసంధానం అవుతాయి. డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్లో ఏపీ కూడా ఉంది. అత్యంత విలువైన భార ఖనిజాలు వెలికి తీసి క్రిటికల్ ఎలక్ట్రానిక్స్ తయారీకి ఉపకరించే అవకాశం ఉంది’ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.


టెక్స్‌టైల్ సెక్టార్‌కు ఊతం..

ఐఎస్ఎం 2.0 ద్వారా సెమీ కండక్టర్‌కు రూ.40 వేల కోట్లు పెట్టారు. టెక్స్ టైల్ సెక్టార్‌కు కూడా ఊతమిచ్చారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ’మన రాష్ట్రానికి ఈ అంశం చాలా ఉపకరిస్తుంది. పర్యాటకానికి, హాస్పిటాలిటీకి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. మన రాష్ట్రంలో అరకులో టూరిజం పెరగడానికి దోహదం చేస్తుంది. కోకోనట్, జీడి, కోకో, చందనం లాంటి పంటలకు ఊతమిచ్చేలా చర్యలు ఉన్నాయి. డేటా సెంటర్లకు పన్ను మినహాయింపులు 2047 వరకూ పెట్టారు. భారత్.. డేటా సెంటర్ల హబ్‌గా తయారవుతుంది. విశాఖపట్నానికి గూగుల్‌తో సహా వివిధ డేటా సెంటర్లు వస్తున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌కు ఊతమిచ్చేలా ఈ డేటా సెంటర్లు తయారవుతాయి.పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి. లాజిస్టిక్స్ రంగానికి ఏపీ పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. కేంద్ర బడ్జెట్‌లో తొలిసారిగా లాజిస్టిక్స్ రంగం అభివృద్ధి గురించి ప్రస్తావించారు’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బడ్జెట్‌లో ఏపీకి భారీ నిధులు.. అమరావతికి ప్రత్యేక ప్యాకేజీ

చరిత్రలో లేని మెజార్టీ కూటమికే దక్కింది: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 01 , 2026 | 08:22 PM