తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
ABN , Publish Date - Feb 02 , 2026 | 10:22 AM
తిరుపతి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చెన్నై నుంచి తిరుపతికి బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు కృష్ణాపురం మూలమలుపు వద్ద ప్రమాదానికి గురయ్యారు. హైవే పక్కన ఉన్న చింత చెట్టును వీరి బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.
తిరుపతి జిల్లా, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా నాగలాపురం మండలం కృష్ణాపురం వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి తిరుపతికి వ్యక్తిగత పనుల నిమిత్తం వెళ్తున్న ఇద్దరు యువకులు ప్రమాదానికి గురయ్యారు. కృష్ణాపురం వద్ద ఉన్న ప్రమాదకరమైన మలుపులో వేగంగా వస్తున్న బైక్.. ఒక్కసారిగా అదుపుతప్పి హైవే పక్కనే ఉన్న చింత చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులకు తల భాగంలో తీవ్ర గాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే మృతిచెందారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజకీయాలను నేరమయం చేయడమే వైసీపీ సిద్ధాంతం.. జగన్ అండ్ కోపై సీఎం చంద్రబాబు ఫైర్
మంత్రి లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. జోగి రమేశ్‌పై కేసు నమోదు
Read Latest AP News And Telugu News