‘తిరుమల శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలు, పెరటాసి శనివారాల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. వారికి ఎక్కడా అసౌకర్యం కల్గకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి’ అని అధికారులను టీటీడీ జేఈవో శరత్ ఆదేశించారు. శుక్రవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలోని తన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు.
స్విమ్స్ ఆవరణలోని ఎస్వీ ఆయుర్వేద కళాశాల, పద్మావతి వైద్య కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు మంగళవారం కలుషిత ఆహారంతో అస్వస్థత పాలైన ఘటనపై హై పవర్ కమిటీ విచారణ పూర్తయింది. రెండు రోజుల పాటు ఆసుపత్రి, హాస్టళ్ళు, వంటశాల, నీటి సరఫరా వ్యవస్థలను పరిశీలించిన మంగళగిరి ఎయిమ్స్ అకడమిక్ డీన్ రామ్మోహన్ నేతృత్వంలోని కమిటీ సభ్యులు విద్యార్థుల వాంగ్మూలాలను నమోదు చేశారు.
పోలీసు శాఖలో సుదీర్ఘకాలంపాటు సేవలందించి.. ఉద్యోగ విరమణ పొందిన నలుగురు పోలీస్ అధికారులను ఎస్పీ సుబ్బరాయుడు సత్కరించి, వీడ్కోలు పలికారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది.
ఆర్టీసీ కడప జోన్ ఇన్‌చార్జి ఈడీగా ఎం.జగదీ్‌షను, తిరుపతి ఇన్‌చార్జి డీపీటీవోగా కె.శ్రీనివాసరావును నియమిస్తూ విజయవాడ ప్రధాన కార్యాలయం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను శుక్రవారం జిల్లా యంత్రాంగం విడుదల చేసింది. అధికారులు, సిబ్బంది పకడ్బందీగా పనిచేయడంతో బోగస్ ఓట్లు భారీగా తగ్గాయి.
అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు, స్కీమ్ వర్కర్లకు, ఆశాలకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి డిమాండ్ చేశారు. శుక్రవారం కలెక్టరేట్ వద్ద ఆశా, అంగన్‌వాడీ, స్కీమ్ వర్కర్లు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు.
వెంకటగిరిలో భూకబ్జాలు, అక్రమ నిర్మాణాలపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఇటీవల ఆంధ్రజ్యోతిలో కథనాలు ప్రచురితమైన నేపథ్యంలో కలెక్టర్ వెంకటేశ్వర్ స్పందించి సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భరత్ నాయక్ స్థానిక తహసీల్దారు శిరీషతో కలిసి పలు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
మదనపల్లె అటవీప్రాంతంలో ఎర్రచందనం తరలిస్తూ పట్టుబడ్డ సునీల్‌కుమార్(30)కు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.3లక్షల జరిమానా విఽధిస్తూ ఆర్‌ఎ్‌సఏడీజే కోర్టు న్యాయమూర్తి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు.
జిల్లాలో ఇప్పటికి సాగైంది 21037 ఎకరాలు. ఇందులో 3569.42 ఎకరాల్లోని పంటకే రైతులు బీమా చేశారు. మిగతా వారు ఎందుకనో ఆసక్తి చూపడం లేదు. ఎల్‌నినో నేపథ్యంలో పంటలు ఎండిపోయినా.. బీమా చేస్తే దీమాగా ఉంటుందని అధికారులు చెబుతున్నా, చూద్దాం లే.. అంటూ సరిపెట్టేస్తున్నారు.
మనం ఏదైనా చేయగలమనే ఆత్మవిశ్వాసం ఉంటే.. అదే మీ అభివృద్ధికి తొలిమెట్టు అని మహిళలను ఉద్దేశించి ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు.