కులమతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం
ABN , Publish Date - Feb 03 , 2026 | 09:57 AM
ఎమ్మెల్యే పులివర్తి నాని సంచలన ద్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకులు కులమతాల మధ్య చిచ్చుపెట్టి అల్లర్లు సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. అలాగే.. వైసీపీ నేతల్లా తాము రౌడీలం కాదని ఆయన అన్నారు.
- వైసీపీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ఎమ్మెల్యే నాని
తిరుపతి: వైసీపీ నాయకులు కులమతాల మధ్య చిచ్చుపెట్టి అల్లర్లు సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నారని, శాంతిభద్రతలకు విఘాతం కల్గించే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే పులివర్తి నాని(MLA Pulivarthi Nani) హెచ్చరించారు. సోమవారంసాయంత్రం ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ దుశ్చర్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి జైలు నుంచి బయటకు రాకూడదని వైసీపీ నేతలే ప్రార్థనలు చేశారన్నారు. ఆయనగురించి కూటమి ప్రభుత్వం ఎక్కడా ఆలోచించడం లేదన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లపై జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
వైసీపీ నేతల్లా తాము రౌడీలం కాదన్నారు. చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధిపైనే ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. 2029లోనూ తానే ఎమ్మెల్యేగా గెలుస్తా, రాసిపెట్టుకోమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనూ కూటమి అధికారంలోకి వస్తుందన్నారు. కల్తీ నెయ్యిపై మరింత లోతుగా విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. అందులో చెవిరెడ్డి ప్రమేయం కూడా ఉందనే అనుమానం కలుగుతోందన్నారు. చౌక సరుకులు తరలించే వాహనాల్లో లక్షల సంఖ్యలో లడ్డూ ప్రసాదాలు తరలించారని, దానిపై కూడా విచారణ జరగాలన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
దిగి వస్తున్నాయి.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
రైల్వే బడ్జెట్‌లో.. రాష్ట్రానికి 10134 కోట్లు
Read Latest Telangana News and National News