రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
ABN , Publish Date - Feb 03 , 2026 | 12:27 AM
నాగలాపురం మండలం కృష్ణాపురం వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు.
సత్యవేడు, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): నాగలాపురం మండలం కృష్ణాపురం వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. ఎస్‌ఐ సునీల్ కథనం మేరకు... పిచ్చాటూరు మండలం రామగిరి గ్రామానికి చెందిన సంజయ్(23), చిత్తూరు జిల్లా నిండ్ర మండలం నిండ్ర దళితవాడకు చెందిన నాగరాజు(20) చెన్నై పుదువాయిల్ లోని అమెజాన్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. నాగలాపురంలోని కల్యాణ మండపంలో ఆదివారం రాత్రి జరిగిన వివాహానికి హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో రాత్రి 12 గంటల సమయంలో కృష్ణాపురం గ్రామ సమీపంలో బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చింతచెట్టుకు ఢీకొంది. ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సత్యవేడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీఐ మురళీ నాయుడు, ఎస్‌ఐ సునీల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా పుత్తూరు డీఎస్పీ రవికుమార్ సోమవారం సాయంత్రం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కృష్ణాపురం మలుపు వద్ద స్పీడ్ బ్రేకర్ ఆధునికీకరించాలని, ట్రేడింగ్ స్టిక్కర్లు వేయాలని, స్పీడ్ బ్రేకర్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు ఫోన్‌లో సూచించారు.