Share News

విద్యార్థి సంఘం నేతల కిడ్నాప్.. మోహన్ బాబు కాలేజీ బౌన్సర్లు అరెస్ట్

ABN , Publish Date - Feb 03 , 2026 | 05:10 PM

ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు విద్యాసంస్థల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించేందుకు బయల్దేరిన విద్యార్థి సంఘం నాయకులు కిడ్నాప్‌నకు గురయ్యారు.

విద్యార్థి సంఘం నేతల కిడ్నాప్.. మోహన్ బాబు కాలేజీ బౌన్సర్లు అరెస్ట్

తిరుపతి, ఫిబ్రవరి 03: ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు విద్యాసంస్థల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ కలెక్టరేట్ వద్ద మంగళవారం ధర్నా నిర్వహించేందుకు బయల్దేరిన విద్యార్థి సంఘం నాయకులు కిడ్నాప్‌నకు గురయ్యారు. దీంతో సహచర విద్యార్థి సంఘం నాయకులు వెంటనే తిరుచానూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు దృష్టికి వెళ్లడంతో.. ఏఎస్పీ రవి మనోహరాచారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక బృందాలు వెంటనే రంగంలోకి దిగి.. నారావారిపల్లి సమీపంలోని భీమవరం వద్ద కిడ్నాపర్ల వాహనాన్ని అడ్డుకున్నాయి. కిడ్నాప్‌నకు గురైన విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు విడిపించి.. తిరుచానూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు.


అలాగే కిడ్నాపర్లను అరెస్ట్ చేశారు తిరుచానూరు పోలీసులు. వారి వాహనాలను స్వాధీనం చేసుకుని.. పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. కిడ్నాప్‌నకు పాల్పడిన వారంతా మోహన్ బాబు కాలేజీ బౌన్సర్లుగా పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ చేసిన వారితోపాటు చేయించిన వారిపైనా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా హెచ్చరించారు. కిడ్నాప్‌నకు గురైన వారిలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్‌తోపాటు నవీన్ ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగిత్యాలలో జగడం.. తీవ్రంగా స్పందించిన మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

పడమర వీధి గంగానమ్మ జాతర.. పోటెత్తిన భక్తులు

Read Latest AP News and National News

Updated Date - Feb 03 , 2026 | 05:44 PM