పడమర వీధి గంగానమ్మ జాతర.. పోటెత్తిన భక్తులు
ABN, Publish Date - Feb 03 , 2026 | 03:37 PM
ఏలూరు పడమర వీధి గంగానమ్మ జాతర మహోత్సవంలో ఆఖరి ఘట్టమైన కొర్ల బండి (అమ్మ వార్లను సాగనంపే మహోత్సవం) అంగరంగ వైభవంగా జరిగింది. పడమర వీధి జాతర కొలువుల కమిటీ అధ్యక్షుడు చోడే బాలు పలువురు సభ్యులు ఆధ్వర్యంలో 90 రోజులకుపైగా నిర్వహించిన ఈ తుది ఘట్టంలో భాగంగా సోమవారం అమ్మవార్లను పంబలిని కొర్ల బండిలో కొలువుదిర్చి.. ఊరి పొలిమేరలకు సాగనంపారు.
1/20
ఏలూరు పడమర వీధి గంగానమ్మ జాతర మహోత్సవంలో ఆఖరి ఘట్టమైన కొర్ల బండి (అమ్మ వార్లను సాగనంపే మహోత్సవం) అంగరంగ వైభవంగా జరిగింది.
2/20
పడమర వీధి జాతర కొలువుల కమిటీ అధ్యక్షుడు చోడే బాలు పలువురు సభ్యులు ఆధ్వర్యంలో 90 రోజులకుపైగా నిర్వహించిన ఈ తుది ఘట్టంలో భాగంగా సోమవారం అమ్మవార్లను పంబలిని కొర్ల బండిలో కొలువుదిర్చి.. ఊరి పొలిమేరలకు సాగనంపారు.
3/20
డప్పు వాయిద్యాలు, మేళతాళాలు, చిత్ర విచిత్ర వేషధారణలు, రెండువేల మందిపైగా కళాకారులతో జాతర ఊరేగింపు నగర పురవీధుల్లో వైభవంగా కొనసాగింది.
4/20
ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర మేయర్ షేక్ నూర్జహాన్, పెదబాబు ముందుగా ప్రత్యేక పూజలు చేసి.. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
5/20
ఈ ఊరేగింపును తిలకించడానికి వేలాది మంది భక్తులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఏలూరుకి తరలి వచ్చారు.
6/20
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కళా బృందాల ప్రత్యేక ప్రదర్శనలు అందరిని విశేషంగా ఆకట్టుకున్నాయి.
7/20
ఏడేళ్లకు ఒకసారి ఏలూరులో గంగానమ్మ జాతర జరుగుతుంది. ఈ నగర ప్రజలు ఈ జాతరను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.
8/20
జాతర సందర్భంగా 3 నెలలు ఏలూరు నగరంలో ఏ శుభకార్యాలు నిర్వహించరు. వివాహాలు సైతం వాయిదా వేస్తారు. జాతర సమయంలో అమ్మవారు నగర సంచారం చేస్తారు. తూర్పు వీధి, పడమర వీధులలో ప్రధానంగా గంగానమ్మ ఆలయాలు కొలువుదీరి ఉన్నాయి.
9/20
ఈ రెండు ఆలయాల్లోనూ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఏలూరు మహానగరంలో గ్రామదేవతలు కొలువుదీరిన ప్రతిచోట ఈ జాతర మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు.
10/20
ముఖ్యంగా ఆది మహాలక్ష్మమ్మ, పోతురాజు బాబుల జాతర జరపడం ఆచారంగా వస్తుంది.
11/20
ముడుపు కట్టడం, మేడల వద్దకు అమ్మవారిని తీసుకురావడం, కొర్లబండి వేయడం, కుంభం పోయడం, సాగనంపడం.. జాతరలోని ముఖ్యఘట్టాలు. జాతర సందర్భంగా కలశాలతో అమ్మవారికి నైవేద్యాలు సమర్పించే మహిళా భక్తులతో ఏలూరు నగరం సందడిగా మారుతోంది.
12/20
మహాకుంభం సమర్పించే రోజున పెద్దఎత్తున అన్నపురాశిని అమ్మవారికి బలిగా సమర్పిస్తారు.
13/20
ఈ జాతర సందర్భంగా ఏలూరు నగరం అంతటా ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది. శ్రీశ్రీశ్రీ గంగానమ్మ, శ్రీమహాలక్ష్మమ్మ, శ్రీపోతురాజు బాబుల జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతాయి. గంగానమ్మ గడప గడపకు ఊరేగుతూ ఆశీర్వాదాలు అందజేశారు.
14/20
అమ్మవారికి భక్తులు పసుపు నీళ్లతో స్వాగతం పలుకుతారు. 96 రోజుల పాటు ఈ జాతర సాగుతోంది.
15/20
ఈ జాతర ప్రారంభం నుంచి మూడు నెలల పాటు పండగలు, శుభకార్యాలు ఎట్టి పరిస్థితుల్లో జరపరు.
16/20
ఈ జాతర తుది ఘట్టం సందర్భంగా నగరంలో భారీగా పోలీసులు మోహరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.
17/20
ఈ జాతర సందర్భంగా ఏలూరు నగరంలోకి బయట నుంచి వచ్చే వాహనాలను మరో మార్గం ద్వారా దారి మళ్లించారు.
18/20
జాతర సందర్భంగా నగర పుర వీధులు భక్తులతో కిక్కిరిసిపోయాయి.
19/20
జాతర సందర్భంగా కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.
20/20
మరో ఏడేళ్ల తర్వాత ఏలూరులో గంగానమ్మ జాతర జరగనుంది.
Updated at - Feb 03 , 2026 | 03:42 PM