ఎల్‌నినో ప్రభావంతో ఎన్నడూ లేనంతగా ఎండలు. ముఖం చాటేసిన నైరుతి రుతుపవనాలు. అడుగంటుతున్న భూగర్భ జలాలు.. చెరువులు.. రిజర్వాయర్లు. వీటి ప్రభావంతో చిత్తూరు నగర ప్రజలకు నీటి ఎద్దడి ముంచుకొస్తోంది.
వైద్య రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఏటా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సదస్సులు, చర్చా గోష్ఠులు, సమావేశాలు నిర్వహించుకుంటున్నాం
కూటమి ప్రభుత్వ హయాంలోనూ ఓ వైసీపీ కార్యకర్త.. రైల్వేకోడూరులో చక్రం తిప్పుతున్నాడు. తన అక్రమ వ్యవహారాలను కొనసాగిస్తున్నాడు.
జిల్లా ఆర్థికాభివృద్ధి కార్యాచరణ ప్రణాళికను శాస్ర్తీయంగా రూపొందించాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య (గనులు) శాఖ ముఖ్య కార్యదర్శి, తిరుపతి ఎకనామిక్ రీజన్ సీఈవో ముఖేష్ కుమార్ మీనా అధికారులకు సూచించారు. శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో ముఖేష్ కుమార్ మీనా అధ్యక్షతన జేసీ శివనారాయణశర్మ ఆధ్వర్యంలో జిల్లా ఆర్థికాభివృద్ధి కార్యాచరణపై సమీక్ష నిర్వహించారు.
ముసాయిదా ఓటరు జాబితాలో క్లెయిమ్‌లు, అభ్యంతరాలను ఆగస్టు 30వ తేదీలోపు ఇవ్వాలని డీఆర్‌వో వెంకటేశు పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లాలోని ఐదు నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసి, అన్ని రాజకీయ పార్టీ నాయకులకు నకలు కాపీలను అందజేశారు.
ప్రియుడితో కలసి భర్తపై రోకలిబండతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం గుర్రంకొండ మండలంలో చోటుచేసుకుంది. బాధితుడి వివరాల మేరకు.. కురబలకోట మండలం కోటవీధికి చెందిన టి.రఘునాథ్(52) లారీడ్రైవర్. అతని భార్య వనజ కొన్ని రోజులుగా గాలివీడు మండలం గొట్టివీడుకు చెందిన రామ్మోహన్‌తో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి.
అమరావతి చాంపియన్‌షి్‌ప-2026కు సంబంధించి జిల్లా స్థాయి పోటీలకు 3300 మంది ఎంపికయ్యారు. దీనికిగాను నియోజకవర్గాల స్థాయిలో నిర్వహించిన ఎంపిక పోటీలు శుక్రవారంతో ముగిశాయి. అండర్-17, అండర్-23 బాలబాలికల విభాగంలో అథ్లెటిక్స్, విలువిద్య, వెయిట్ లిఫ్టింగ్ పోటీలు జరిగాయి.
అతడు 15 ఏళ్లపాటు నమ్మకాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. రూ.లక్ష నుంచి మొదలు పెట్టిన చీటీలను రూ.కోటికి చేర్చాడు. అతడిపై నమ్మకంతో వందలాది మంది చీటీలు వేశారు. చివరకు ఆరు నెలలుగా చీటీలు పాడిన వారికి డబ్బులు ఇవ్వకుండా.. నమ్మకంగా ముంచేసి.. పరారయ్యాడు సతీష్. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వి.కోట సీఐ సోమశేఖర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. వి.కోట మండలం పాతూరుకు చెందిన సతీష్ 2008లో ఆదిత్య ఆటో ఫైనాన్స్ ఏర్పాటు చేసి, వాహనాలకు రుణాలిచ్చేవాడు.
‘సర్’ ప్రక్రియలో భాగంగా జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ముసాయిదా ఫొటో ఓటర్ల జాబితాలను అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రచురించినట్లు డీఆర్వో మోహన్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ‘సర్’ కార్యక్రమంపై సమీక్షించారు.
జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే పలమనేరు నియోజకవర్గంలోనే అత్యధికంగా 29,381 మంది ఓటర్ల పేర్లు తొలగించారు. ఆ తర్వాత చిత్తూరులో 26436 మంది, కుప్పంలో 24418 మంది, నగరిలో 20879 మంది, పూతలపట్టులో 20321 మందిను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. జీడీనెల్లూరులో నియోజకవర్గంలో మాత్రం అత్యల్పంగా 14624 మంది పేర్లే తొలగించారు.