పరశురామేశ్వరుడి సేవలో హీరో కల్యాణ్‌రామ్
ABN , Publish Date - Feb 04 , 2026 | 02:12 AM
సినీ హీరో నందమూరి కల్యాణ్ రామ్ మంగళవారం పలు ఆలయాలను దర్శించుకున్నారు.తిరుమల శ్రీవారిని ఉదయం తోమాల సేవలో దర్శించుకున్న ఆయన తరువాత శ్రీకాళహస్తికి చేరుకుని జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకుని రాహుకేతు పూజలు చేశారు.
సినీ హీరో నందమూరి కల్యాణ్ రామ్ మంగళవారం పలు ఆలయాలను దర్శించుకున్నారు.తిరుమల శ్రీవారిని ఉదయం తోమాల సేవలో దర్శించుకున్న ఆయన తరువాత శ్రీకాళహస్తికి చేరుకుని జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకుని రాహుకేతు పూజలు చేశారు.అనంతరం ఏర్పేడు మండలం గుడిమల్లంలోని పరశురామేశ్వర స్వామిని, వడమాలపేట మండలం అప్పలాయగుంటలోని ప్రసన్న వెంకటేశ్వరస్వామిని కూడా కళ్యాణ్‌రామ్ దర్శించుకున్నారు.