గ్రామీణాభివృద్ధికి ఆర్థిక వనరులు అవసరం
ABN , Publish Date - Feb 04 , 2026 | 02:22 AM
గ్రామాణాభివృద్ధికి ఆర్థిక వనరులు అవసరమని కలెక్టర్ వెంకటేశ్వర్ స్పష్టం చేశారు. పన్నుల వసూలు, శానిటేషన్ తదితర అంశాలపై ఎస్వీయూనివర్సిటీ శ్రీనివాసా ఆడిటోరియంలో మంగళవారం పంచాయతీరాజ్ శాఖ సమీక్ష సమావేశంలో ఆయన ప్రసంగించారు.
పంచాయతీరాజ్ శాఖ సమీక్షలో కలెక్టర్
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): గ్రామాణాభివృద్ధికి ఆర్థిక వనరులు అవసరమని కలెక్టర్ వెంకటేశ్వర్ స్పష్టం చేశారు. పన్నుల వసూలు, శానిటేషన్ తదితర అంశాలపై ఎస్వీయూనివర్సిటీ శ్రీనివాసా ఆడిటోరియంలో మంగళవారం పంచాయతీరాజ్ శాఖ సమీక్ష సమావేశంలో ఆయన ప్రసంగించారు. పన్ను బకాయిలపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి, ప్రజలకు అవగాహన కల్పిస్తూ వసూలు చేయాలన్నారు. పారిశుధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం ఉండేలా చూడాలన్నారు. సమావేశం అనంతరం జిల్లాలో ఉత్తమ ప్రతిభ చూపిన పంచాయతీ రాజ్ సిబ్బందికి పంచాయతీరాజ్ శాఖ అడిషనల్ కమిషనర్ సుధాకర్ రావుతో కలిసి కలెక్టర్ అవార్డులు ప్రదానం చేశారు. డీపీవో సుశీలా దేవి, అసిస్టెంట్ డైరెక్టర్ సాయి లహరి, పంచాయతీ అభివృద్ధి అధికారులు, ఉప మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. జడ్పీ డిప్యూటీ సీఈవో వెంకట నారాయణ, డీఎల్‌పీవో సురేష్ నాయుడు, డీడీవోలు, పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు.